ఫోకస్

నిర్మాణ రంగానికి ఢోకా లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. దీనివల్ల నల్లధనానికి అడ్డుకట్ట పడుతుంది. రియల్ ఎస్టేట్ ప్రక్షాళనకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో యోగ్యత లేని డెవలపర్లకు అడ్డుకట్ట పడుతుంది. హైదరాబాద్ మార్కెట్‌లో 95శాతం మధ్య తరగతి గృహ విభాగమే ఉంటుంది. సేవింగ్స్, బ్యాంకు రుణాల నుంచే వీరు గృహ రుణాలు చెల్లిస్తారు. నోట్ల చలామణి లేకపోవడం అనేది ఈ రంగంపై ప్రభావం చూపదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డెవలపర్లు తమకు అవసరం అయిన మూలధనాన్ని కొనే్నళ్లనుంచి బ్యాంకులనుంచే పొందుతున్నారు. రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో క్రెడాయ్ సభ్యుల వాటా 85శాతం వరకు ఉంటుంది. నోట్ల చలామణి రద్దువల్ల ప్రభుత్వ పన్ను ఆదాయం పెరగవచ్చు. దీనివల్ల ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టడంతోపాటు ఆర్థికాభివృద్ధి సాధించవచ్చు. 2020 నాటికి అందరికీ ఇళ్లు, 100 స్మార్ట్ నగరాలను అభివృద్ధి చేయడం లాంటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు సాధ్యమవుతుంది. దీనివల్ల గణనీయంగా ఉద్యోగ కల్పన సాధ్యమవుతుంది. నగదు పర్యవేక్షణ వ్యవస్థ ఉన్నప్పుడు గృహ కొనుగోలుదారుల జేబుల్లోకి మరింత నగదు చేరుతుంది. 2017 రియల్ ఎస్టేట్ రంగంలో రెరా బిల్‌ను మే 2017లో పరిచయం చేయబోతున్నారు. దీనివల్ల భారీ మార్పు చోటు చేసుకుంటుంది. ఏప్రిల్ నుంచి జిఎస్‌టి అమలులోకి వస్తుంది. జిఎస్‌టి ధరలు అమలులోకి వచ్చాక రియల్ ఎస్టేట్ ధరలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి నోట్ల చలామణి రద్దు అనేది ఓ కార్యక్రమంగా మేం భావిస్తున్నాం. ఆర్థిక వ్యవస్థకు ఇది మంచిది. ఖాతాలలో చేరకుండా జరుగుతున్న నగదు లావాదేవీలు ప్రధాన ఆర్థిక వ్యవస్థలో భాగమైన తరువాత ఇది తప్పనిసరి అయింది. ఈ చర్యలవల్ల అతి తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు లభిస్తాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ధరలు ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. బ్యాంకులవద్ద గృహ రుణాలకు నిధులు మరింతగా అందుబాటులో ఉంటాయి. క్రెడాయ్ సభ్యుల నడుమ రియల్ ఎస్టేట్ లావాదేవీలలో నగదు డీల్స్ అనేవి ఉండవు. మేం పారదర్శకంగా కార్యకలాపాలు నిర్వహిస్తాం. ఐదారేళ్లుగా నగదు లావాదేవీలు నిర్వహించడం లేదు. దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగంపై ఈ నోట్ల రద్దు ప్రభావం అసలేమీ ఉండదు. ధరల్లో మార్పులు కూడా ఉండవు. నోట్ల రద్దు ప్రభావం ఉండదు కానీ జిఎస్‌టి అమలులోకి వచ్చిన తరువాత ఆ ప్రభావంతో కొంతవరకు ధరలు పెరగవచ్చు.

- ఎస్.రామ్‌రెడ్డి, క్రెడాయ్ అధ్యక్షుడు-తెలంగాణ