ఫోకస్

2వేల నోటు ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లధనాన్ని నిర్మూలించేందుకు 500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. బాగానే ఉంది కానీ రెండు వేల రూపాయల నోటును ఎందుకు తెచ్చినట్లు? ఇది నల్లధనాన్ని ప్రోత్సహించడం కాదా? స్విట్జర్లాండ్ తదితర దేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకుని రావడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం దానిని కప్పిపుచ్చుకోవడానికి పెద్దనోట్లను రద్దు చేసింది. కార్పొరేట్లకు అనుకూలంగా క్రోనీ కెపిటలిజాన్ని పెంచి పోషించి, అంబానీ, అదానీలకు అత్యంత లాభాలు సమకూరుస్తున్నారు. విదేశీ పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) జపం చేస్తూ సకల సమస్యలకు ఇదే పరిష్కారం అంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నాన్ని కేంద్రం చేస్తున్నది. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న చర్యను దేశంలోని 93 శాతం ప్రజలు సమర్థిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఇందుకు డూప్లికేట్ సర్వేలు వెల్లడిస్తున్నారు. పెద్దనోట్ల రద్దుతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. నోట్ల రద్దుపై ప్రశ్నిస్తే, వారిని దేశ ద్రోహులు, ఉగ్రవాదులు, పాకిస్థాన్‌కు అనుకూలమైనవారు, నల్లకుబేరులను ప్రోత్సహిస్తున్నారని ఎదురుదాడి చేయడం దురదృష్టకరం. రైతులు, చిరు వ్యాపారులు, పిల్లల పెళ్ళిళ్ళకోసం ఏళ్ళ తరబడి కష్టపడి బ్యాంకుల్లో దాచి పెట్టుకున్న వారిని ఏవిధంగా సంపాదించారో వివరణ ఇవ్వాలని ఐటి శాఖ లక్షలాది మందికి నోటీసులు పంపించనున్నట్లు సమాచారం. విజయ మాల్య, లలిత్ మోదీ మాత్రం తప్పించుకుని తిరుగుతున్నారు. రైతులు ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేసేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నోట్లను రద్దు చేయడం వెనుక ఉద్దేశం ఏమిటో, నల్లధనాన్ని ఎలా అరికడతారో ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటుకు వెళ్ళి చెప్పేందుకు ఎందుకు వెనుకాడుతున్నారో అర్థం కావడం లేదు. రెండు వేల నోట్లను మార్కెట్లోకి తేవడం అంటే దోచుకునేవారికి అది మరింత సులువు అవుతుంది, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. ఎంత పెద్దనోటును తెస్తే అంత పెద్దఎత్తున నల్లధనాన్ని ప్రోత్సహించడమే అవుతుంది.

- అజీజ్ పాషా, మాజీ ఎంపి, తెలంగాణ సిపిఐ నాయకుడు