ఫోకస్

సంస్కరణలు తేకుండా ఎలా సాధ్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంస్కరణలు తేకుండా నల్లధనాన్ని నిర్మూలించడం ఎలా సాధ్యం? అసలు నల్లధనం నిర్వచనం ఏమిటో తేలాలి. ఒక వ్యక్తి తక్కువ ధరకు మార్కెట్‌లో ఒక వస్తువు లేదా ఒక ప్లాటు కొన్న కొన్ని నెలలకో సంవత్సరాలకో మంచి రేటు వస్తుంది. దాన్ని విక్రయిస్తే, వచ్చిన లాభాన్ని నల్లధనం అంటారా? అనేది ముందుగా తేల్చాలి. దేశంలో ఐదు శాతం మంది వద్ద అన్‌అకౌంటెడ్ డబ్బుంటే, నల్లధనాన్ని అరికడతామంటూ బీరాలు పలికిన బిజెపి అగ్ర నేతలు, ప్రధాని నరేంద్ర మోదీ చివరకు పెద్దనోట్లను రద్దు చేసి ప్రజల్లో నవ్వుల పాలయ్యారు. దేశంలో 95 శాతం మంది ప్రజలు పెద్దనోట్ల రద్దు దెబ్బతో కకావికలమయ్యారు. ఈ దెబ్బతో వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆగ్రహానికి గురికాకతప్పదు. అక్రమార్కులు నగదు ఉంచుకుంటారా... అంటే కాదు బంగారం, భూముల వంటి స్థిర, చరాస్తులను ఖరీదు చేస్తారు. వాటిని ఎలా బయటకు తీయగలరు? దీనికి మోదీ సమాధానం చెప్పాలి. పైగా స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో నిల్వ ఉన్న మన దేశానికి చెందిన నల్లకుబేరుల ధనాన్ని వెనక్కి తెప్పించి పేదల బ్యాంకు అకౌంట్లలో 15 లక్షల రూపాయల చొప్పున జమ చేస్తామని ఇచ్చిన హామీ ఏమైంది?
నల్లధనాన్ని అరికట్టేందుకు 500, వెయ్యి రూపాయల నోట్ల రూపాయలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. బాగానే ఉంది, కానీ, వెయ్యికి రెట్టింపుగా 2 వేల రూపాయల నోటును చలామణిలోకి తీసుకుని రావడంలోని ఆంతర్యం ఏమిటో ఎవరికీ బోధ పడలేదు. ఇంకా పెద్దనోటు తెస్తే దోచుకున్నవారికి, దాచుకోవడానికి తేలిక కాదా? దేశంలో 60 శాతం అక్షరాస్యత మాత్రమే ఉంది. అదికూడా లోపభూయిష్టంగా ఉంది. చైనాలో ఒకటే భాష ఉంది. 1600 అక్షరాలు రాయగలిగితేనే అక్షరాస్యులుగా పరిగణిస్తారు. కానీ మన దేశంలో పేరు రాయగలిగి, సంతకం చేస్తేనే అక్షరాస్యులుగా గుర్తించడం జరుగుతున్నది. అటువంటప్పుడు దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగాన్ని విస్తారంగా పెంచుతామంటే సాధ్యమయ్యే పనేనా? పైగా మెజారిటీ గ్రామాల్లో బ్యాంకులు లేవు. ఎటిఎంల సంగతి గ్రామీణ ప్రజలకు అసలే తెలియదు. అకౌంట్లు లేనివారి సంఖ్య కోకొల్లలు. ఇవేవీ పట్టించుకోకుండా పునాది లేకుండా భవనం నిర్మించినట్లు, ఆలోచన చేయకుండా, వాస్తవికతను దృష్టిలో పెట్టుకోకుండా పెద్ద నోట్లను రద్దు చేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఓటు బ్యాంకు, భ్రాంతి రాజకీయాలు చేయడం తగదు. ప్రధాని మోదీ నిర్ణయం వల్ల పెళ్ళిళ్ళు ఆగిపోయాయి, పేదల గుండెలు ఆగిపోయి మృత్యువాత పడ్డారు. అన్నదాతలు కన్నీటిపర్యంతమయ్యారు. వాస్తవాలు మాట్లాడితే నల్లకుబేరులకు బాసటగా నిలుస్తున్నారని, దేశద్రోహి అని బిజెపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. సంస్కరణలు చేపట్టకుండా నల్లధనాన్ని అరికట్టడం అసాధ్యం.

- డాక్టర్ శ్రవణ్ దాసోజు ముఖ్య అధికార ప్రతినిధి, టి.పిసిసి