ఫోకస్

ఆశించిన ఫలితాలు రావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరెన్సీ రద్దువల్ల కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశాలు లేవు. నల్లధనాన్ని వెలికి తీసేందుకు, నకిలీ కరెన్సీని అరికట్టేందుకు, తీవ్రవాదులు, ఉగ్రవాదుల మూలంగా జమ్మూకాశ్మీర్‌లో ఏర్పడుతున్న ఇక్కట్లను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసినట్టు ప్రకటించింది. నిజం చెప్పాలంటే ఇది అనాలోచిత, అప్రజాస్వామిక చర్య. తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం. నరేంద్ర మోదీ ఎవరితోనూ చర్చించకుండా ఈ నిర్ణయం తీసుకున్నారంటే అది ప్రజాస్వామ్య విరుద్ధం, నియంత పోకడ అవుతుంది. కొంతమందితోనైనా చర్చించారని భావిస్తే అది బడాబాబులకు ముందుగానే తెలిసే ఉంటుంది. అంటే పెద్దవారు, కోట్లాది ఆస్తులున్నవారు ముందుగా జాగ్రత్తపడే ఉంటారు. ఏ విధంగా చూసినా ఈ అంశంలో తీసుకున్న నిర్ణయం సబబు కాదు. నల్లడబ్బు కేవలం 500 రూపాయల నోట్ల రూపంలోనో, 1000 రూపాయల నోట్ల రూపంలోనో ఉండాల్సిన పనిలేదు. నల్లడబ్బును వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టవచ్చు. డబ్బున్నవాళ్లు అనేక కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. గతంలో రెండు పర్యాయాలు నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నప్పటికీ, పెద్దగా సత్ఫలితాలు ఇవ్వలేదు. లోతుగా ఆలోచిస్తే 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు దేశం మొత్తం కరెన్సీలో 85 శాతం దాకా ఉన్నాయి. కేవలం 500 రూపాయల నోట్లు మాత్రమే అయితే 55 శాతం వరకు ఉన్నాయి. గతంలో నోట్ల రద్దు చేసిన సమయంలో కాని, ఇప్పుడు కానీ నల్లధనం బయటకు రాలేదు. ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన నల్లడబ్బు ఆరుశాతం మించిలేదు. ఒక కాలనీలో ఒకరు దొంగతనం చేస్తే ఆ కాలనీలో అందరినీ చితకబాదినట్టు ప్రస్తుతం దేశంలోని పరిస్థితి ఉంది. కొంతమంది బ్లాక్‌మనీ ఉన్నవారికోసం దేశ ప్రజలందరినీ ఇక్కట్లకు గురిచేసినట్టు అవుతోంది. రోజూ కూలీలు ఉపాధి కోల్పోతున్నారు. కేవలం 2000 రూపాయలు బ్యాంకు నుండి విత్‌డ్రా చేసుకునేందుకు రోజంతా క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి కూలీలకు ఏర్పడ్డది. దాంతో కూలీ చేసుకునే రోజంతా ఎలాంటి ఆదాయం లేకుండా గడచిపోతోంది. కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని పేదలు కోల్పోతున్నారు. దాంతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. దేశంలో ఆరు లక్షల ఊళ్లుంటే 50 వేల బ్యాంకు బ్రాంచీలున్నాయి. దాంతో ప్రజలకు సత్వరంగా ఆర్థిక సేవలు అందడం లేదు. పేదలు, మధ్య తరగతివారు తమ వద్ద ఉన్న మిగులు ధనాన్ని బ్యాంకులో దాచుకుంటారు. డబ్బును డిపాజిట్ చేసేందుకు, విత్‌డ్రా చేసుకునేందుకు ఇబ్బంది కలుగుతోంది. స్వాతంత్య్రం వచ్చిన ఏడుదశాబ్దాల్లో మోదీ తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమైందని అధికార పార్టీ ప్రచారం చేస్తోంది. వాస్తవంగా ఈ నిర్ణయం ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తోందే తప్ప, దేశ అభివృద్ధికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చడం లేదు.

- పి.ఎస్.ఎం.రావు, ఆర్థికవేత్త