ఫోకస్

నల్లడబ్బుకు ఇదా విరుగుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దనోట్ల ఉపసంహరణ తర్వాత దేశంలో ఈ అంశంపై తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది. బ్యాంకులు, ఎటిఎంల ముందు జనం క్యూలు కడుతూనే ఉన్నారు. ఇకమీదట క్యూలు లేకుండా ఉండటానికి డిజిటలైజేషన్ పద్ధతిలో నగదు మార్పిడి, చెల్లింపులు జరుపుకోవాలని కేంద్రం సూచిస్తోంది. అంటే క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఆన్‌లైన్ చెల్లింపులు, చెక్ లేదా డిడి రూపంలో చెల్లింపులు జరగాలని సూచిస్తోంది. ఇందుకోసం కంప్యూటర్లు అందుబాటులో లేనివారు తమ స్మార్ట్ఫోన్ల ద్వారా కూడా ఈ వ్యవహారాలు నడిపేందుకు తగిన రీతిలో ప్రభుత్వమే యాప్‌లను రూపొందించింది. ఈ యాప్‌ల ద్వారా సామాన్య ప్రజలు సైతం చెల్లింపులు చేసేలా ప్రోత్సహించాలనేది ప్రభుత్వ యోచనగా ఉంది. పెద్దనోట్ల రద్దుకు సంబంధించి ఇంతవరకూ ప్రకటించిన చర్యలే కాకుండా రానున్న రోజుల్లో మరింత కఠినమైన చర్యలను ప్రకటించే వీలుందని ఇప్పటికే ప్రధాని సంకేతాలు ఇచ్చారు. నల్లధనం పూర్తిగా వెలికితీయడం, నకిలీ నోట్లను చిరునామా లేకుండా చేయడం, ఆస్తులు కొద్దిమంది వద్దనే ఉండకుండా, ప్రజల్లో వ్యత్యాసాన్ని తగ్గించడం, అన్నింటికీ మించి రానున్న రోజుల్లో ప్రతి స్ర్తి లేదా పురుషుడిని ఆదాయపన్ను పరిధిలోకి తీసుకురావడం లక్ష్యంగా కనిపిస్తోంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే రానున్న రోజుల్లో ప్రతి వ్యక్తి రహస్య ఆదాయాన్ని కలిగి ఉండటం నేరంగా మారబోతోంది. తమ ఆదాయాన్ని బహిర్గత పరచాల్సిందేననేది ప్రభుత్వ యోచనగా ఉంది. నోట్ల రద్దుతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా ఒకే నిర్ణయంతో రానున్న రోజుల్లో బహుళ ప్రయోజనాలు ఒనగూరుతాయని చెప్పకనే చెబుతున్నారు. ఇక మీదట కరెన్సీతోపాటు బంగారం, ఆభరణాలు తదితరాల రూపంలో ఆదాయాన్ని కలిగి ఉండటం కూడా నేరంగా మారబోతోంది. ఇందుకుగాను వచ్చే కొద్ది నెలల్లో బ్యాంకు లాకర్లలో ఉన్న ఆస్తులను కూడా జమ చేయాలని, లెక్కించాలని కేంద్రం చూస్తోందని వార్తలు వస్తున్నాయి. మొత్తంమీద ధనవంతులకు చుక్కలు కనిపిస్తుండగా, సామాన్యుడు మాత్రం కేంద్రం నిర్ణయాలతో సంతోషంగా కనిపిస్తున్నాడు. బ్యాంకుల వద్ద లైన్లలో నిల్చున్న శ్రమకంటే ధనవంతులు ఇబ్బందిపడుతున్నారనే ఆనందం సామాన్యుడిలో కనిపిస్తోంది. కేంద్రం నిర్ణయాలు తీసుకోవడం వరకూ అంతా బాగానే ఉన్నా లక్ష్యాలు ఎంతవరకూ నెరవేర్చగలం అనేది ఆలోచించాలి. దేశంలో 130 కోట్ల జనాభా ఉంది. వీరిలో అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉంది. వీరంతా సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రభుత్వం భావిస్తున్న దిశగా వర్చ్యువల్ కరెన్సీని వాడగలుగుతారా? అది సాధ్యమేనా అనేది ఆలోచించాలి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే అరవై శాతానికి పైగా నగదు రహిత లావాదేవీలతో సింగపూర్, నెదర్లాండ్స్ అగ్రస్థానంలో ఉండగా, ఫ్రాన్స్, స్వీడన్, కెనడా, బెల్జియం, బ్రిటన్ వంటివి 50 శాతం మైలురాయి దాటేశాయి. పొరుగున ఉన్న చైనాలో 10 శాతం మాత్రమే నగదు రహితంగా నడుస్తోంది. ఇండియాలో పట్టుమని రెండు శాతం కూడా లేదు. సగటున లక్ష మందికి ఇండియాలో 20 ఎటిఎంలున్నాయి. చైనా, కెనడాల్లో లక్ష మంది జనాభాకు కనీసం 200 ఎటిఎంలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 1.35 లక్షల బ్యాంకు శాఖలుండగా, గ్రామాల్లో 50వేల బ్యాంకులున్నట్టు లెక్కలు తేలింది. ఇప్పటికే జన్‌ధన్ తదితర పాతిక కోట్ల బ్యాంకు ఖాతాలకు ఆధార్, సెల్ నెంబర్లను అనుసంధానం చేశారు. పెద్దనోట్ల రద్దుతో నల్లధనం, నకిలీ నోట్లను నిరోధించగలుగుతామా అనే అంశంపై నిపుణుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.