ఫోకస్

పెండింగ్‌లో 3కోట్ల కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివిధ కోర్టుల్లో మూడు కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

ట్రయల్ కోర్టులు, హైకోర్టులు, సుప్రీం కోర్టులో ఈ మూడు

స్థాయిల కోర్టుల్లో మూడు కోట్ల కేసులు పేరుకు పోయాయి.

వీటిలో లక్ష కేసులు వివిధ హైకోర్టుల్లో ఉంటే, సుప్రీంకోర్టులో

65వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. హైకోర్టుల్లో 50శాతం

ఖాళీలున్నాయి. జీవిత కాలంలో న్యాయస్థానాల్లో న్యాయం

లభిస్తుందనే ఆశలు కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా

మూడున్నర వేలమంది ఎమ్మెల్యేలు ఉండగా, వీరిలో 40

శాతం మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నాయని

తేలింది. విచారణ జరిగి, తీర్పులు వచ్చేంతవరకు వీరి

పదవీకాలం ముగిసిపోతుంది. దాంతో వీరిలో చాలా మంది

మంత్రులుగా కూడా పదవులు చేపడుతున్నారు. ప్రజా

ప్రతినిధులపై కొన్ని సందర్భాల్లో తీర్పులు వచ్చేందుకు

15ఏళ్లు కూడా పడుతున్నాయి. కోర్టుల్లో కేసులు

పేరుకుపోవడానికి వాయిదాలు కూడా ఒక ప్రధానమైన

కారణం. వాయిదా అనేది పది రోజులకు మించి

ఉండకూడదు. వాయిదాలను తగ్గించేందుకు మా సంస్థ

తరఫున మేం కొన్ని ప్రతిపాదనలు చేశాం. పదే పదే

వాయిదాలు కోరే వారిపై జరిమానా విధించాలి. మొదటిసారి

వాయిదా కోరినప్పుడు జరిమానా విధించి, రెండవసారి

వాయిదాకు జరిమానాను పెంచుతూ పోవాలి. దీనివల్ల

ఉద్దేశపూర్వకంగా వాయిదాలు కోరే వారిని కట్టడి

చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక సుప్రీంకోర్టు

వ్యవహరిస్తున్న తీరుసైతం చిత్రంగా ఉంది.

న్యాయవాదులను మేమే నియమించుకుంటాం,

విధివిధానాలు మేమే నిర్ణయించుకుంటాం, ప్రభుత్వంతో

సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరించడం

ప్రజాస్వామ్యయుతంగా లేదు. న్యాయమూర్తుల

నియామకంపై కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాష్టప్రతి

ఆమోదముద్ర వేసిన తరువాత కూడా సుప్రీంకోర్టు

తిరస్కరించింది. ఇక కేసులను సత్వరం పరిష్కరించాలనే

ఉద్దేశంతో రిటైర్డ్ న్యాయమూర్తులను తిరిగి

నియమించేందుకు కేంద్రం ప్రయత్నిస్తే, సుప్రీంకోర్టు

అడ్డుకుంది. ఇది సరైన విధానం కాదు. న్యాయమూర్తులను

అభిశంసించే విధానం ఉన్నా, అమలు సాధ్యం కాదు. జస్టిస్

నాగార్జున రెడ్డి కేసుతోపాటు ఇప్పటివరకు ఇలాంటి

అభిశంసన తీర్మానాలు మూడు వచ్చాయి. ఏ ఒక్కటి

కూడా సభలో ఆమోదం పొందలేదు. సినిమా హాళ్లలో

జాతీయ గీతాన్ని ఆలపించాలని తీర్పు చెప్పారు. కానీ అదే

న్యాయస్థానాల్లో జాతీయ గీతం ఆలపించాలనే ప్రతిపాదనకు

మాత్రం అంగీకరించడం లేదు.

- త్రిపురనేని హనుమాన్ చౌదరి ప్రజ్ఞ్భారతి