ఫోకస్

వ్యవస్థను బలహీనపర్చే కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైకోర్టుల్లో 500 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా

ఉన్నాయి. జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో ఐదు వేల

న్యాయాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దిగువ

కోర్టులు, హైకోర్టు, సుప్రీం కోర్టుపై కేసుల పరిష్కారం

విషయంలో తీవ్రమైన వత్తిడి పెరుగుతోంది.

న్యాయమూర్తులు నాణ్యమైన తీర్పులను

వెలువరించలేకపోతున్నారు. లక్షలాది కేసులు పెండింగ్‌లో

ఉన్నాయి. సామాన్యుడు కోర్టులను ఆశ్రయించి సత్వరమే

న్యాయాన్ని పొందలేకపోతున్నాడు. దీనికి మూలాలను

అనే్వషిస్తే దిగ్భ్రాంతికరమైన అంశాలు వెల్లడవుతాయి.

సుప్రీం కోర్టు కొలీజియంతో కేంద్రం అవలంభిస్తున్న

ఘర్షణాత్మకమైన వైఖరివల్ల న్యాయమూర్తుల

నియామకంలో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ఇటీవల

కేంద్రం కొలిజీయం సిఫార్సు చేసిన 42 మంది

న్యాయమూర్తుల జాబితాను తిప్పిపంపింది. లోతుగా

ఆలోచిస్తే కేంద్రంలో అధికారంలో ఉండేది ఒక రాజకీయ

పార్టీ. తమకు కావాల్సిన వారి పేర్లు కొలీజియంలో లేకపోతే

ఆమోదించడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఏపి సిఎం

చంద్రబాబుపైన ఎన్నో అభియోగాలతో పిటిషన్లు వివిధ

సందర్భాల్లో దాఖలైనా, ఏమి జరిగిందో అందరికీ తెలిసిందే.

న్యాయ వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకుంటే రాజ్యాధికారం

సురక్షితంగా తమ చేతిలో ఉంటుందని, ఒకవేళ ఎన్నికల్లో

ఓటమి చెందినా, తమకు కావాల్సినవారు న్యాయ వ్యవస్థలో

ఉన్నందువల్ల వారిద్వారా తమకు వివిధ అభియోగాల

కేసుల్లో ఊరట లభిస్తుందనే దుర్బుద్ధితో అధికారంలో ఉన్న

రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. రాజ్యాంగంలోనే

శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థకు మధ్య ఘర్షణ

తలెత్తకుండా సున్నితమైన విభజన రేఖ ఉంది. దీనివల్లనే

ప్రజాస్వామ్యం చక్కగా వర్థిల్లుతుంది. కాని దుర్భుద్ధి ఉన్న

రాజకీయ పార్టీల వల్ల న్యాయ వ్యవస్థలో మితిమీరిన

జోక్యంవల్ల ప్రజాస్వామ్యానికి హాని కలుగుతుంది. మన

హైకోర్టులో 50 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మన

న్యాయమూర్తులపై వత్తిడి పెరుగుతోంది. కోర్టు పని రోజుల్లో

రోజుకు 300 నిమిషాలు పనిచేస్తుంది. అందులో మొదటి 15

నిమిషాలు మెన్షన్లు, లంచ్‌మోషన్లు ప్రస్తావన ఉంటుంది.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల పలు

సందర్భాల్లో న్యాయమూర్తుల ఖాళీలను వెంటనే భర్తీ

చేయాలని, కొలీజియం సిఫార్సులను ఆమోదించాలని,

కంటతడి పెట్టారు. సామాన్యుడికి న్యాయం

చేయలేకపోతున్నామని, న్యాయాధికారులు,

న్యాయమూర్తులపైన పెనుభారం పడుతోందని అన్నారు.

పార్లమెంటు చేసిన చట్టాలను సుప్రీం కోర్టు ప్రశ్నించి

లోపాలుంటే నిలువరించగలదు. కాని కోర్టు తీర్పులపైన

కూడా పార్లమెంటు ఆమోదించాల్సిందే. ఇంత శక్తివంతమైన

న్యాయవ్యవస్థను బలోపేతం చేయకుండా,

దురుద్దేశ్యపూరితంగా న్యాయమూర్తుల పోస్టుల భర్తీని

జాప్యం చేస్తూ బలహీనపరచడం తగదు. జ్యుడీషియల్

కమిషన్ ఏర్పాటు చేస్తే రాజకీయాలు పెరుగుతాయి.

కొలీజియం విధానాన్ని కొనసాగించాలి.

- పొన్నవోలు సుధాకరరెడ్డి అధ్యక్షుడు, వైకాపా ఆంధ్రప్రదేశ్ లీగల్ సెల్