ఫోకస్

సమర్థులను నియమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలోని కోర్టుల్లో, మరీ ముఖ్యంగా హైకోర్టులు,

సుప్రీంకోర్టులో సమర్థత, నిబద్ధత కలిగిన వారినే

న్యాయమూర్తులుగా నియమించాలి. ఇందుకోసం

న్యాయవ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ సంయుక్తంగా నిర్ణయం

తీసుకోవాలి. సమర్థత లేనివారిని నియమిస్తే ఎలాంటి

ఉపయోగం ఉండదు. కొంతమంది జడ్జీలు తమ పదవీ

కాలంలో ఒక్క తీర్పు కూడా ఇవ్వకుండా పదవీవిరమణ

చేసినవారు ఉన్నారు. సమర్థత, అనుభవం ఉన్న జడ్జీల

వద్దకు ఎలాంటి కేసులు వచ్చినా తొలుత వాటిలో మెరిట్

పరిశీలిస్తారు. విచారణకు యోగ్యమైనవిగా భావిస్తే,

నోటీసులు జారీ చేస్తారు లేనిపక్షంలో మొట్టమొదటనే

వాటిని తిరస్కరిస్తారు. సమర్థత గలిగినవారు జడ్జీలుగా

ఉంటే తీర్పులు కూడా త్వరగా వెలువడతాయి. ఉన్నత

న్యాయస్థానాల్లో జడ్జీల పోస్టులు ఖాళీగా ఉండటం,

పరిపాలనాపరమైన లొసుగులవల్ల కేసులు చాలాకాలం

పెండింగ్‌లో ఉంటున్నాయి.
ప్రస్తుతం జడ్జీల నియామకం విధానంలో లోటుపాట్లు

ఉన్నాయి. సుప్రీంకోర్టు ‘కొలీజియం’ పారదర్శకంగా లేదని

స్వయంగా సుప్రీంకోర్టు జడ్జీగా పనిచేస్తున్న జస్టిస్

చలమేశ్వర్ ఒక సందర్భంగా పేర్కొనడం ఇక్కడ గమనార్హం.

1950 నుండి 1993 వరకు జడ్జీల నియామకం భారత

రాష్టప్రతి చేసే సిఫార్సులపై ఆధారపడి సుప్రీం కోర్టు ప్రధాన

న్యాయమూర్తి చేసేవారు. కేంద్ర ప్రభుత్వం సలహాలు,

సూచనల మేరకు జడ్జీల నియామకానికి పేర్లను రాష్టప్రతి

సిఫార్సు చేసేవారు. ఈ విధానం సజావుగా సాగుతూ

వచ్చింది. కొలీజియం విధానం వచ్చిన తర్వాత సమస్యలు

ప్రారంభమయ్యాయి. జడ్జీలుగా నియమించేముందు సదరు

వ్యక్తుల గుణగణాలను ప్రభుత్వ అధీనంలోని ఇంటెలిజెన్స్

అధికారులు పరిశీలించి, సుప్రీంకోర్టుకు నివేదిక

అందిస్తున్నారు. సుప్రీంకోర్టుకు స్వయంగా ఇంటెలిజెన్స్

విభాగం ప్రత్యేకంగా లేకపోవడంతో ప్రభుత్వ విభాగంపైనే

ఆధారపడాల్సి వస్తోంది. ఈ విధానంలో పొరపాట్లు జరిగే

అవకాశం లేకపోలేదు. బిజెపి అధికారంలోకి వచ్చిన

తర్వాత జడ్జీల నియామకం తదితర అంశాలను

పరిశీలించేందుకు, సిఫార్సు చేసేందుకు నేషనల్

జూడిషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్‌ను కేంద్రం

ఏర్పాటు చేసింది. ఇందుకోసం భారత పార్లమెంట్‌తో పాటు

16 రాష్ట్రాలు కూడా ఆమోదించాయి. భారత రాజ్యాంగానికి

99వ సవరణగా ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.

వాస్తవంగా మన దేశంలో రాజ్యాంగం అందరికీ

ఆమోదయోగ్యమైంది. అయితే ఈ కమిషన్ ఏర్పాటుకు

సంబంధించిన చట్టాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం

కొట్టివేసింది. ఇప్పుడు కొలీజియం విధానం సాగుతోంది.

కేంద్రం మళ్లీ మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్స్‌ను రూపొందించి

సుప్రీంకోర్టుకు నివేదించింది. ఇది ఫైనల్ కావలసి ఉంది. ఈ

పరిస్థితిలో సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం ఒక అంగీకారానికి

వచ్చి సముచిత నిర్ణయం తీసుకుంటే కేసులు వేగంగా

పరిష్కరించేందుకు వీలవుతుంది.

- జస్టిస్ రెడ్డపరెడ్డి హైకోర్టు మాజీ న్యాయమూర్తి