ఫోకస్

న్యాయమెంత ఆలస్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో వివిధ కోర్టుల్లో 2.28 కోట్ల కేసులు పెండింగ్‌లో

ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ అధికారికంగా వెల్లడించింది.

దేశంలో జనాభా- న్యాయమూర్తుల నిష్పత్తి కూడా

ఆశావహంగా లేదని, సగటున ప్రతి పది లక్షల జనాభాకు

13 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారని కేంద్ర న్యాయశాఖ

పేర్కొంది. ఐక్యరాజ్య సమితి అధ్యయనం జరిపిన 65

దేశాల్లో ఇంతకన్నా తక్కువ నిష్పత్తిలో జడ్టీలున్న దేశాలు

కేవలం మూడు మాత్రమే. గ్వాటమాల, నికరాగువా, కెన్యా

దేశాలు భారత్ సరసన ఉన్నాయి. ప్రతి పది లక్షల

జనాభాకు కనీసం 50 మంది న్యాయమూర్తులు ఉండాలని

లా కమిషన్ చేసిన సిఫార్సు ఇంకా పరిశీలనలోనే ఉంది. ఏ

దేశ న్యాయవ్యవస్థ నుండైనా ఆ దేశ ప్రజలు ఆశించేది

ఏముంది? ఎక్కడ అన్యాయం జరిగినా దానిని

సరిదిద్దడానికి న్యాయవ్యవస్థ ముందుంటుందనే

నమ్మకాన్ని కలిగించాలి. ఎక్కడ పేదరికం ఉన్నా, హింస

ప్రజ్వరిల్లినా, నిర్లక్ష్యం పొడసూపినా, శ్రద్ధ లేకున్నా దానిని

న్యాయవ్యవస్థ సరిచేస్తుందనే భరోసా దేశ ప్రజల్లో కల్పించాలి.

భారతదేశంలో దిగువస్థాయి న్యాయస్థానాల్లో 5111

న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. న్యాయం

అదించడంలో కీలకమైన ఈ న్యాయస్థానాల్లో మంజూరైన

21,303 పోస్టులకు గానూ 16,192 మంది మాత్రమే

పనిచేస్తున్నారు. ఉన్నతస్థాయి న్యాయస్థానాల్లో 450 ఖాళీల

గురించి తరచూ చర్చ జరుగుతునే ఉంది, కాని దిగువ

స్థాయి న్యాయస్థానాల్లో ఖాళీల గురించి ఎవరూ

మాట్లాడలేదు.
గుజరాత్‌లో 794 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, బీహార్‌లో

792 ఖాళీలున్నాయి. 11 రాష్ట్రాల్లో అక్కడి హైకోర్టులే

నియామకాలు చేపడుతుండగా, మరో 17 రాష్ట్రాల్లో పబ్లిక్

సర్వీసు కమిషన్లు న్యాయమూర్తుల నియామకాలను

పర్యవేక్షిస్తున్నాయి. 2005లో జిల్లా అంతకంటే దిగువ స్థాయి

న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు 11,682 మంది ఉంటే 2015

నాటికి ఆ సంఖ్య 16,070కి పెరిగింది. న్యాయమూర్తుల

సంఖ్య పెరిగి, ఏటా దాఖలయ్యే కేసుల సంఖ్య తగ్గినా సివిల్

కేసులు పెద్దఎత్తున పేరుకుపోతున్నట్టు అధికారిక పత్రం

వెల్లడిస్తోంది. ఏళ్లు గడచినా అతీగతీ లేకుండా

న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌లో ఉండిపోవడానికి

కారణం ఏమిటో అందరికీ తెలుసు. ఈ విషయంలో

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ ప్రతి

సందర్భంలోనూ న్యాయమూర్తుల ఖాళీలపై

ప్రస్తావించడమేకాదు, ఎందుకు ఖాళీలు భర్తీ చేయడం

లేదంటూ కేంద్రాన్ని నిలదీశారు కూడా.

స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ

అంశాన్ని ప్రస్తావిస్తారని భావించానని, ఆయన

ప్రస్తావించకపోవడంతో చాలా బాధపడ్డానని ఠాకూర్ పేర్కొని

సంచలనానికి తెరతీశారు. న్యాయమూర్తుల సదస్సులో

కూడా జస్టిస్ ఠాకూర్ ఈ అంశాన్ని ప్రస్తావించి

కంటతడిపెట్టుకున్నారు. న్యాయమూర్తుల ఖాళీలపై

దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యం ప్రస్తావనకు వచ్చినపుడు

కూడా జస్టిస్ ఠాకూర్ తీవ్రంగానే స్పందించారు.

న్యాయపరంగా జోక్యం చేసుకునే పరిస్థితి కల్పించవద్దని

కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. ఏడాది కాలం

గడచినా అఫిడవిట్ దాఖలు చేయకపోవడాన్ని ఆయన

తప్పుపట్టారు. రెండు వారాల్లో అఫిడవిట్ ఇస్తామని అటార్ని

జనరల్ ముకుల్ రోహత్గి హామీ ఇచ్చారు. న్యాయవ్యవస్థ-

కేంద్రప్రభుత్వం మధ్య జరుగుతున్న ఈ పంచాయతీలో

బాధితులు సామాన్య ప్రజలే. సకాలంలో కేసులు

పరిష్కారంకాక, ఎంతో డబ్బు, సమయం వృధా

చేసుకుంటున్నారు. ఈ అంశంపై నిపుణుల అభిప్రాయాలే

ఈ వారం ఫోకస్.
chitram...
ఆవేదనలో
జస్టిస్ ఠాకూర్