ఫోకస్

హక్కులుండాలి.. బాధ్యతగా మెలగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘త్రిపుల్ తలాఖ్’ అంశంలో అలహాబాద్ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ఆహ్వానించదగ్గదే. వాస్తవం చెప్పాలంటే మన దేశంలో రాజ్యాంగమే అత్యున్నతమైంది. కోర్టులు రాజ్యాంగానికి లోబడే తీర్పులు ఇస్తుంటాయి. అందువల్ల హైకోర్టు ఇచ్చిన తీర్పు శిరోధార్యమే. సాంకేతికంగా అలహాబాద్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ సునీత్ కుమార్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు విస్తృత ధర్మాసనానికి లేదా ఉన్నత కోర్టుకు వెళ్లవచ్చు. అంటే ఈ తీర్పును ఛాలెంజ్ చేయవచ్చు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధి వౌలాని ఖలీద్ రశీద్ ఇప్పటికే ఈ అంశంపై తమ అభిప్రాయం వెల్లడించారు. త్రిపుల్ తలాఖ్ విషయంలో అలహాబాద్ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తమ బోర్డు ఉన్నత కోర్టులో ఛాలెంజ్ చేస్తుందని ప్రకటించారు. ఈ తీర్పుపై ఉన్నత కోర్టులో పిటిషన్ వేయడం విషయం ఎలా ఉన్నప్పటికీ, మహిళలకు సమాన హక్కులు ఉండాలి. కుటుంబంలోనూ, సమాజంలోనూ తగిన గౌరవం ఉండాలి. కులం, మతాలకు సంబంధం లేకుండా భారతదేశంలోని మహిళలందరికీ సమాన హక్కులు ఉండాల్సిందే. భారత రాజ్యాంగానికి లోబడే పౌరులంతా జీవించాలి. రాజ్యాంగం దేశంలోని పౌరులందరికీ ప్రాథమిక హక్కులను కల్పించింది. ఈ హక్కుల్లో మొట్టమొదటిది ‘రైట్ టు ఈక్వాలిటీ’. ఈక్వాలిటీ అన్న అంశం విస్తృతమైంది. కులం, మతం, లింగం, ప్రాంతం తదితర బేధాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, సమాన బాధ్యతలు ఉండాలి. ప్రాథమిక హక్కుల్లో చివరిది రైట్ టు కాన్ట్సిట్యూషన్ రెమెడీస్. ఆర్టికల్ 32 కింద దీన్ని పొందుపరిచారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే దానిపై చట్టరీత్యా ప్రశ్నించేందుకు వీలుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సమాజంలో మహిళలకు సమాన అవకాశాలు కావల్సిందే.
సమాజంలో శాంతి నెలకొనాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది. ప్రతి కుటుంబంలో శాంతి ఉండాలి. అంటే కుటుంబ సభ్యులు మరీ ముఖ్యంగా భార్యాభర్తలు పరస్పరం గౌరవించుకోవాలి. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించాలి. కుటుంబంలో ప్రతి వ్యక్తికి హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి. ఒక కుటుంబంలో మహిళలే కీలకభూమిక పోషిస్తారు. కుటుంబం ఆదాయాన్ని గుర్తుంచుకుని ఖర్చులు చేయాలి. కుటుంబం ఒక బండి అనుకుంటే భార్యాభర్తలు రెండు చక్రాలలాంటి వాళ్లు. ఏ చక్రం పనిచేయకపోయినా బండి ముందుకు కదలదు. అలాగే భార్యాభర్తలు ఇరువురూ పరస్పర సహకారంతో పనిచేస్తేనే ఆ కుటుంబం సజావుగా ఉంటుంది. ఆ కుటుంబంలో శాంతి ఉంటుంది. జీవితంలో అనేక ఒడిదుడుకులు వస్తుంటాయి. ప్రతి కుటుంబానికి ‘కాంప్రమైజ్’ అన్నది ముఖ్యమైంది. చిన్న చిన్న విషయాలు, అభిప్రాయబేధాలు వస్తే చర్చించుకుని పరిష్కరించుకోవాలి. ఇద్దరూ మొండిగా వ్యవహరిస్తూ పట్టుదలకు పోతే కుటుంబ జీవనం విచ్ఛిన్నం అవుతుంది. జీవనం నరకంలా మారుతుంది. అందుకే ముస్లిం కుటుంబాలు ముస్లిం పర్సనల్ లాకు లోబడి ఉన్నప్పటికీ, తుది నిర్ణయం రాజ్యాంగానిదే అవుతుంది.

- పి. రాధ కన్వీనర్, తెలంగాణ వికాస తరంగిణి.