ఫోకస్

మతపరమైన అంశాల్లోకి వెళ్లవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముస్లిం సమాజంలో మహిళలు ఎదుర్కొనే అన్ని సమస్యలకు ముస్లిం పర్సనల్ లా బోర్డు పరిష్కారాలు చూపిస్తోంది. ముస్లింల వివాహాలపై, విడాకులు, తదితర అంశాలపై రాజ్యాంగంలో చేర్చలేదు. షరియత్ చట్టంలోని అంశాలను భారతదేశంలోని ముస్లింలు మొదటినుంచీ పాటిస్తున్నారు. మత ధర్మంలో భాగమైన ఈ మార్గదర్శకాలను ముస్లిం పర్సనల్ లా బోర్డు పర్యవేక్షిస్తోంది. కొన్ని శతాబ్ధాలుగా ఎప్పుడూ ఎటువంటి సమస్యలు తలెత్తలేదు. కొంతమంది ఖాజీల దురాశ, స్వార్థంవల్ల అప్పుడప్పుడు కొంతమంది ముస్లిం మహిళలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న మాట వాస్తవం. ఇటువంటి ఖాజీలపై ముస్లిం పర్సనల్ లా బోర్డు కఠిన చర్యలు తీసుకుంటోంది. గతంలో కూడా గౌరవ న్యాయస్థానాలు కూడా ముస్లిం వివాహాలకు సంబంధించిన అంశాలపై జోక్యం చేసుకునేవి కావు. తాజాగా అప్పుడప్పుడు కొన్ని కోర్టులు తీర్పులు ఇస్తున్నాయి. ఈ తీర్పులు కూడా ముస్లిం మహిళలకు న్యాయం చేయమంటున్నాయి. ఈ స్ఫూర్తితో ముస్లిం పర్సనల్ లా బోర్డు ముస్లిం వివాహ చట్టాల్లో ఉన్న లోపాలను సరిదిద్ది మార్గదర్శకాలను పటిష్టంగా చేయాల్సి ఉంది. కొంత మంది మహిళలు తమ వేదనను తెలియచేసేందుకు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఎవరినీ తప్పు బట్టాల్సిన అవసరం లేదు. ముస్లిం సమాజంలో మహిళల రక్షణకు ముస్లిం పర్సనల్ లాబోర్డు అన్ని చర్యలు తీసుకుంటోంది. అవసరమైతే బోర్డును పటిష్టం చేసే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ముస్లిం సమాజంలో కూడా బహు భార్యత్వ ఉదంతాలు గణనీయంగా తగ్గాయి. ఈ రోజు మహిళలు, పురుషులు చదువుకుంటున్నారు. ఆలోచన విధానంలో కూడా మంచి మార్పులు వస్తున్నాయి. వివాహ చట్టాలు మతధర్మానుసారంగా ఉంటాయి. కాలానుగుణంగా ఇందులో సవరణలు, మార్పులకు బోర్డు శ్రీకారం చుట్టేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలి. ముస్లిం సమాజానికి చెందిన అంతర్గత అంశాలపై ఇంత చర్చ అవసరం లేదు. కాని ఏ మహిళలకు అన్యాయం జరిగినా బోర్డు చూస్తూ ఊరికే ఉండరాదు. దీనికి సంబంధించి కాలానుగుణంగా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

- సలాం బాబు అధ్యక్షుడు, వైకాపా ఏపి విద్యార్థి సంఘం