ఫోకస్

కోర్టుల జోక్యం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముస్లిం పర్సనల్ లా విషయంలో కోర్టులు జోక్యం చేసుకోరాదు. ఉమ్మడి పౌర స్మృతి ఉండాలనుకోవడం సమంజసం కాదు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ట్రిపుల్ తలాఖ్‌పై చర్చ జరుగుతున్నది. తాజాగా అలహాబాద్ హైకోర్టు ట్రిపుల్ తలాఖ్‌పై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు మీడియాలో చూశాం. అంతకుముందు ట్రిపుల్ తలాఖ్‌ను వ్యతిరేకిస్తూ కొంతమంది ముస్లిం మహిళలు కోర్టును ఆశ్రయించారు. ముస్లింలలో నూటికి 99 శాతం మంది ట్రిపుల్ తలాఖ్‌ను సమ్మతిస్తారు. ట్రిపుల్ తలాఖ్ ఇప్పుడు కొత్తగా రాలేదు. వందలు, వేల సంవత్సరాలుగా ఉన్నది. హోలి ఖురాన్ ప్రాఫిట్ మస్మద్ (హదీస్) ఆదేశాల మేరకు ఆచరణలోకి వచ్చింది. నలుగురు ఇమాంలు కలిసి దీనిని రూపొందించారు. ఇమామ్ ఆజం అబు అనీషా, ఇమామే షాఘ, ఇమామే అహ్మద్ అంబల్, ఇమామే మాలిక్ కలిసి దీనిని ఫిఖా (ఇస్లామిక్ చట్టం)లోకి తీసుకుని వచ్చారు. ఆడవాళ్ళకు అన్యాయం చేయరాదని, వారిపట్ల దయాగుణం కలిగి ఉండాలని ప్రాఫిట్ మహ్మద్ చెప్పారు. కాబట్టి ఎవరూ తొందరపడి తలాఖ్ ఇవ్వరాదు. ట్రిపుల్ తలాఖ్‌పై ఇతర మతస్థుల్లో మంచి అభిప్రాయం లేదు. మూడుసార్లు తలాఖ్ అని చెబితే విడాకులు అయిపోతాయన్నది కరెక్ట్ కాదు. భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తే తొలుత భార్యభర్తలకు చెందిన పెద్ద మనుషులు కూర్చొని వారికి నచ్చజెబుతారు. అయినా వారి మధ్య సయోధ్య కుదరకపోతే ఆ తర్వాత భార్యతో తలాఖ్ అని చెబుతాడు. ఆ తర్వాత 30 రోజుల పాటు భార్యాభర్త దూరంగా ఉండాలి. ఈ మధ్య కాలంలో వారి మనసు మారితే మళ్ళీ కలిసి కాపురం చేసేందుకు అవకాశం ఉంటుంది. అయినా మార్పు రాకపోతే రెండోసారి తలాఖ్ చెప్పి, మళ్లీ 30 రోజుల పాటు దూరంగా ఉంటారు. అయినప్పటికీ వారిలో మార్పు రాకపోతే మూడోసారి తలాఖ్ ఇస్తున్నట్లు (ట్రిపుల్ తలాఖ్) మూడుసార్లు చెబుతారు. అప్పుడే విడాకులు జరుగుతాయి. ఆ తర్వాత వారు మళ్లీ పెళ్ళి చేసుకునేందుకు పూర్తి స్వేచ్ఛను పొందుతారు. ఒకవేళ వారికి సంతానం ఉన్నట్లయితే, వారు మైనర్ అయితే భార్య సంరక్షణలో మేజర్ అయ్యేంత వరకూ ఉండవచ్చు. ఒకవేళ పిల్లలు తండ్రి సమక్షంలో ఉండాలనుకుంటే ఉండవచ్చు. తలాఖ్‌ను ముస్లింలలో ఏ ఒక్కరూ కోరుకోరు. అనివార్య పరిస్థితుల్లోనే తీసుకుంటారు. ఇందులో కోర్టుల జోక్యం అవసరం లేదు. ఉమ్మడి పౌరస్మృతి కూడా అవసరం లేదు.

- సయ్యద్ షా హమీద్ హుస్సేన్ శుత్తారీ అధ్యక్షుడు, అఖిల భారత సున్నీ ఉలెమా బోర్టు, హైదరాబాద్