ఫోకస్

రెండు చట్టాలతో మహిళలకు మేలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనదేశంలో స్వాతంత్య్రం రాక పూర్వం 1937 నుంచే ‘ముస్లిం పర్సనల్ లా’ అనేది అమలులో ఉంది. ప్రపంచంలో ఉన్న ముస్లింలందరూ ఖురాన్, మొహమ్మద్ ఆదేశాలనే పాటిస్తారు. వేరే మార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరు. దేవుడికి అత్యంత అయిష్టమైనది ‘తలాఖ్’. అందరూ భావిస్తున్నట్లు భర్త మూడుసార్లు భార్యకు తలాఖ్ చెప్పగానే విడాకులు అమలైపోవడం షరియా పద్ధతి కాదు. నిత్యం ఘర్షణ పడుతూ కలిసి ఉండటం కన్నా విడిపోవడమే మేలని భావించినప్పుడు భర్త తలాఖ్ ద్వారా, భార్య అయితే ‘ఖులా’ ద్వారా వివాహ బంధాన్ని రద్దు చేసుకోవచ్చు. షరియా చట్టం మహిళలకు ఆస్తిహక్కు ఇచ్చింది. షరియా వారసత్వ చట్టాల ప్రకారం కొన్ని సందర్భాల్లో ఆడపిల్లలకు వచ్చిన వాటా మగపిల్లలకు వచ్చిన వాటాకన్నా ఎక్కువ కూడా వుంటుంది. వివాహం సందర్భంగా మహిళకు ఇలాంటి అవకాశం కల్పిస్తోంది ముస్లిం పర్సనల్ లా మాత్రమే అనేది గుర్తించాలి. దేశంలో మహిళల హక్కుల పరిరక్షణకు చాలా చట్టాలున్నాయి. ది డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్-2005, ది ప్రివెన్షన్ ఆఫ్ డౌరీ యాక్ట్ 1961, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 125 కింద మెయింటెనెన్స్ వగైరా వగైరా. ముస్లింలకు పర్సనల్ లా ఉన్నంతమాత్రాన ముస్లిం మహిళలు ఈ చట్టాల ద్వారా ప్రయోజనం పొందకూడదని ఎక్కడా రాసిలేదు. ముస్లిం మహిళలు కూడా ఈ చట్టాలను ఆశ్రయించవచ్చు. అంటే ముస్లిం మహిళల భద్రతకు రెండు విధాలా అవకాశాలున్నాయి. వారు ముస్లిం పర్సనల్ లా కింద తమ హక్కులకోసం పోరాడటంతో పాటు, మహిళల హక్కుల పరిరక్షణకు అమలులో ఉన్న చట్టాలను కూడా ఉపయోగించవచ్చు. గృహ హింస, భార్యను వదిలేయటం అనేవి ప్రతి సమూహంలోనూ ఉన్న సమస్యలే. ఇవేమీ ముస్లింలకే ప్రత్యేకమైన సమస్యలు కాదు.

- అల్త్ఫా అలీ రజా మైనారిటీస్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, విజయవాడ.