ఫోకస్

అత్యంత అనాగరికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలాఖ్ అనే ఒక పదంతో ఒక వివాహ బంధం విచ్ఛిన్నం కావడం అనేది అత్యంత అనాగరికం. ఇది ముస్లిం మతంలో కూడా ఇలాంటి అనాగరికమైన చర్య లేనేలేదు. అయితే అన్ని మతాలలో ఉన్నట్టుగానే ముస్లిం మతంలో కూడా కొంతమంది పురుషాధిక్య భావజాలంతో సృష్టించిందే తలాఖ్ దురాచారం. ఇస్లాం మతం కూడా స్ర్తికి సుముచిత గౌరవాన్ని ఇచ్చింది. స్ర్తిలను బాధించడం కానీ, వారిపై దాడి చేయవద్దనే ఇస్లాం చెప్పింది. కానీ కొందరు మత ఛాందసవాదులు, పురుషాధిక్య భావజాలంతో తలాఖ్ అనే ఆచారం ఉందని వక్రీకరిస్తున్నారు. ఎంతో పెద్ద తప్పు చేస్తే ఉరిశిక్ష పడిన వారిని కూడా చివరి కోరిక ఏమిటని అడుగుతారు. మరి అలాంటి అవకాశం కూడా లేకుండా కేవలం తలాఖ్...తలాఖ్...తలాఖ్ అంటూ మూడు పదాలతో వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేస్తామనడం అత్యంత అమాననీయమైంది. అత్యంత అనాగరికమైన ఈ ముఢాచారాన్ని ముస్లిం సమాజం కూడా హర్షించదు. వారిలో కూడా ఎంతో గుణాత్మాకమైన మార్పు వచ్చింది. గతంలో మాదిరిగా కాకుండా ముస్లింలు కూడా ప్రస్తుతం కుటుంబ నియంత్రణ పాటిస్తున్నారు. ఎక్కువ మంది పిల్లలను కనడంవల్ల కలిగే అనర్థాలను గుర్తించారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అధిక సంతానాన్ని కనడంవల్ల కలిగే దుష్ప్రరిణామాలను ముస్లిం సమాజం కూడా గుర్తించింది. గతంలో మాదిరిగా కాకుండా వీరిలో అక్షరాస్యత గణనీయంగా పెరిగింది. ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. ఆర్థికంగా, సామాజికంగా అభ్యున్నతి సాధించడానికి నేటితరం ముస్లిం యువత తపన పడుతోంది. ముస్లిం మహిళలు కూడా ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. గతంలో మాదిరిగా వంటింటికి పరిమితం కాకుండా ప్రజాప్రతినిధులుగా కూడా రాణిస్తున్నారు. వీరిలో ఎంతో గుణాత్మకమైన మార్పు కనిపిస్తోంది. ఈ మార్పు వర్ధమాన దేశాలలోనే కాకుండా ఇస్లాం దేశాలలో సైతం కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జాగృతమైన ముస్లిం సమాజంలో ఇంకా తలాఖ్ వంటి ముఢాచారం ఎక్కడా ఉండకూడదనే కోరుకుందాం. ఒకనాడు హిందు మతంలో కూడా సతిసహగమనం అనే ముఢాచారం ఉండేది. మరి ఇప్పుడు ఎక్కడైనా ఉందా? కాలక్రమేణ ఈ దురాచారం పోయినట్టుగానే తలాఖ్ అనే దురాచారం కూడా కనుమరుగైపోతుందని చెప్పవచ్చు.

- ప్రొఫెసర్ రాజ్‌సిద్ధార్థ సామాజిక విశే్లషకులు, కాకతీయ యూనివర్సిటీ