ఫోకస్

పర్యవేక్షణ అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా కార్పొరేట్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఒకదాని వెంట మరొకటిగా వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ ప్రైవేట్ విశ్వవిద్యాలయానికి రాజధాని అమరావతిలో వందలాది ఎకరాల భూములను ఉచితంగా కాకపోయినప్పటికీ నిర్ణీత రేటుపై కట్టబెట్టడమే గాక స్వహస్తాలతో ప్రారంభోత్సవం కూడా చేసారు. అసలు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన బిల్లు ఆమోదం సమయంలోనే విద్యావేత్తలతో కూలంకుషంగా చర్చించి ఉంటే బాగుండేది. అలా జరుగకపోయినా కఠినమైన నియమ నిబంధనలు కూడా ఎక్కడా కన్పించడం లేదు. ప్రధానంగా అడ్మిషన్లు, అలాగే ఫీజుల విషయంలో ప్రభుత్వం పాత్ర లేకపోవటంవల్ల సామాన్య, మధ్యతరగతి వర్గాలు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు ఒరిగేదేమీ లేదు. ప్రభుత్వ విద్యా సంస్థల తరహాలోనే ఈ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లోనూ మహిళలతోసహా ఈ వర్గాలకు రిజర్వేషన్ సదుపాయం కల్పిస్తే సముచితంగా వుండేది. వారు నిర్ణయించే ఫీజులు సామాన్యులు ఎవరికీ అందుబాటులో వుండవనే భయం ప్రతి ఒక్కరినీ వెంటాడుతున్నది. ఇక ఉద్యోగ నియామకాలు కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరిగేలా చూస్తే స్థానికులకు కొంత ఊరటగా వుంటుంది. ఇక విద్యా ప్రమాణాల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు తక్షణావశ్యకరం. అలాగే స్థానిక కళాశాలల్లో ఉన్న కోర్సులనే ప్రవేశపెడితే అదనపు ప్రయోజనం ఉండదు. అసలు ఏనాడు కూడా సరైన పర్యవేక్షణ లేకుండా కేవలం ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో సరైన విద్యా ప్రమాణాలు లేవనే సాకుతో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు తలుపులు బార్లా తెరువటంపై పునరాలోచన ఎంతైనా అవసరం.

- ఆచార్య కోదాటి వియన్నారావు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపకులపతి