ఫోకస్

ప్రైవేటు వర్శిటీలతో నాణ్యమైన విద్య సాధ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనె్నండవ పంచవర్ష ప్రణాళిక నివేదిక ప్రకారం 2030 నాటికి దేశంలో కనీసం 1500 యూనివర్శిటీల అవసరం ఉందని తేల్చింది. ప్రస్తుతం దేశంలో అన్ని రకాల యూనివర్శిటీలు కలిపి 777 ఉన్నాయి. వీటిలో సెంట్రల్ యూనివర్శిటీలు 47, స్టేట్ యూనివర్శిటీలు 356, డీమ్డ్ వర్శిటీలు 122, ప్రైవేటు యూనివర్శిటీలు 252 ఉన్నాయి. దేశంలో 39 రాష్ట్రాల్లో 29 రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రైవేటు యూనివర్శిటీలున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రైవేటు యూనివర్శిటీల బిల్లులు ఆమోదం పొందాయి. ఇక కొత్త ప్రైవేటు యూనివర్శిటీల ఏర్పాటే మిగిలి ఉంది. దేశం మొత్తంమీద అత్యధికంగా 77 యూనివర్శిటీలు రాజస్థాన్‌లో ఉన్నాయి, అత్యధిక ప్రైవేటు యూనివర్శిటీలకు సైతం రాజస్థాన్ పెట్టింది పేరు. అక్కడ 42 ప్రైవేటు యూనివర్శిటీలు ఉన్నాయి. అత్యధికంగా తమిళనాడులో 28 డీమ్డ్ వర్శిటీలు ఉండగా, రాష్ట్ర యూనివర్శిటీలు అత్యధికంగా గుజరాత్‌లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాలు బెంగాల్, యుపిలదే. మరో వంద యూనివర్శిటీల దరఖాస్తులు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ ఏడాది 45 డీమ్డ్ వర్శిటీలు అడ్మిషన్లు చేపట్టనున్నాయి. ఆంధ్రాలో స్పెషాలిటీ వర్శిటీలతో కలిపి మొత్తం 20 వర్శిటీలు ఉండగా, తెలంగాణలో డీమ్డ్, సెంట్రల్ యూనివర్శిటీలతో కలిపి మొత్తం 25 వరకూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో డిమాండ్‌కు తగ్గట్టు ప్రమాణాలతో కూడిన ఉన్నత విద్యను అందించాలంటే ప్రైవేటు యూనివర్శిటీలపై ఆధారపడక తప్పని పరిస్థితి. మిగిలిన రాష్ట్రాల్లో ప్రైవేటు యూనివర్శిటీలు పనిచేస్తున్నపుడు మన రాష్ట్రంలో ఎందుకు ఉండకూడదనే భావన. విద్యారంగం అభివృద్ధి చెందాలంటే డీమ్డ్ వర్శిటీలతోపాటు ప్రైవేటు యూనివర్శిటీలు ఉంటేనే ప్రభుత్వ యూనివర్శిటీలు సైతం అభివృద్ధి సాధిస్తాయనే చర్చకూడా ఉంది. మరోపక్క ప్రైవేటు యూనివర్శిటీలు వస్తే ఉన్న చదువులు కూడా దెబ్బతింటాయనే భయం కూడా లేకపోలేదు. ప్రైవేటు స్కూళ్లు వచ్చి ప్రభుత్వ పాఠశాలలు కుంటుపడినట్టు, ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలు వచ్చి ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలు దెబ్బతిన్నాయి. ఇక ప్రైవేటు యూనివర్శిటీలు వచ్చి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది.
ప్రభుత్వ యూనివర్శిటీల్లో ఫీజులు వందల్లో, వేలల్లో ఉంటే ప్రైవేటు యూనివర్శిటీల ఫీజులు లక్షల్లో ఉండటం ఖాయం. అలాంటపుడు చదువు కేవలం ధనవంతులకు మాత్రమే అందుతుందనేది నిర్వివాదాంశం. మరోపక్క ప్రభుత్వ యూనివర్శిటీల్లో పద్ధతులు పాటించినా, సమస్యలు వచ్చినా వాటిని సరిదిద్దుకునే వీలుంటుందని, ప్రైవేటు యూనివర్శిటీలపై పర్యవేక్షణ తక్కువగా ఉండటం వల్ల వారి ఇష్టారాజ్యం అవుతుందని విద్యార్ధుల్లో కూడా అభిప్రాయం ఉంది. ప్రైవేటు యూనివర్శిటీలు ఆర్ధిక నిర్వహణ, విద్య ఇతర వ్యవహారాల్లో పూర్తి స్వేచ్ఛతో ఉంటాయి. యుజిసి నిబంధనలతో సంబంధం లేకుండా సొంతంగా అడ్మిషన్లు, అలాగే డిగ్రీలకు, అవార్డులకు తమకు నచ్చిన వారి పేరిట కొనసాగించేందుకు, ఫీజులు నిర్ణయించుకునేందుకు వారికి స్వాతంత్య్రం ఉంటుంది. అధ్యాపకులను నియమించుకోవడం, జీతాలు, నియమనిబంధనలు అన్నింటిపై వారికి అధికారం ఉంటుంది. పరోక్షంగా ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వేయడం ఖాయం అనే ఆందోళన అందరిలో ఉంది. ఈ క్రమంలో ప్రైవేటు యూనివర్శిటీలు వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయనే అంశంపై కొంతమంది నిపుణుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.