ఫోకస్

నోట్ల రద్దు ఒక ప్రయత్నం మాత్రమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లధనం నియంత్రణలో పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఒక ప్రయత్నం మాత్రమే. ఆర్థిక లావాదేవీలన్నీ పారదర్శకంగా జరగాలన్న లక్ష్యంతోనే ప్రధాని నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. నోట్ల రద్దుతో ఇప్పటివరకూ చెలామణిలో ఉన్న నగదు రూ.16.5 లక్షల కోట్లలో రద్దయిన పెద్దనోట్లే అధికం. మొత్తం చెలామణిలో ఉన్న కరెన్సీలో పెద్దనోట్లది 86 శాతం. ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్దనోట్లు బ్యాంకుల్లో జమవుతున్నాయి. డిసెంబర్ 30 నాటికి బ్యాంకుల్లో జమకానిదంతా నల్లధనంగానే భావించాల్సి ఉంటుంది. భవిష్యత్‌లో ఆర్థిక లావాదేవీలు బ్యాంకులద్వారా జరగడం వల్ల పన్నుల రూపంలో ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. తద్వారా పన్ను వసూళ్లు పెరిగి ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నగదు లావాదేవీలు చాలాస్వల్పం. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో ఆర్థిక లావాదేవీలన్నీ నగదు రహితంగా జరుగుతాయి. మన దేశంలో కూడా అటువంటి విధానాన్ని అమలు చేయడం ద్వారా నల్లధనాన్ని నియంత్రించే అవకాశం ఉంది. అయితే దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ సామాన్యులకు అందుబాటులో లేదంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవ దూరం. ఆర్థిక లావాదేవీలు బ్యాంకుల ద్వారానే జరగాలనే నిబంధన లేదు. ఇదే సందర్భంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాం. పోస్ట్ఫాసులు, చౌకధరల దుకాణాలు ఇలా అవకాశం ఉన్న ప్రతిచోటా బ్యాంకింగ్ వ్యవస్థ మాదిరి పనిచేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కార్డులు, బ్యాంకుల ద్వారా నగదు చెలామణి పెరిగితే నల్లధనం కూడబెట్టడం తగ్గుతుంది. దీనితోపాటు విచ్చలవిడిగా పెరిగిపోయిన అవినీతి, లంచగొండితనం నియంత్రణలోకి వస్తుంది. దొంగనోట్ల చెలామణి నివారణవల్ల ఉగ్రవాదం, తీవ్రవాదం నియంత్రణలోకి వస్తుంది. ప్రస్తుతం బ్యాంకుల్లో జరుగుతున్న లావాదేవీల్లో అమలుచేస్తున్న పరిమితులు అవసరమే. బ్యాంకుల నుంచి ఇష్టానుసారం నగదు డ్రాచేస్తే మళ్లీ నల్లధనం పేరుకుపోయే ప్రమాదం ఉంది. నల్లధనం అరికట్టే క్రమంలో ప్రధాని మోదీ సర్కారు మరిన్ని కఠిన నిర్ణయాలు అమలుచేసే అవకాశం ఉంది. ముఖ్యంగా బినామీ ఆస్తుల చట్టం అమల్లోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ నిర్ణయం. దీనివల్ల స్థిరాస్తుల రూపంలో మురుగుతున్న కోట్ల రూపాయల నల్లధనం బండారం బట్టబయలవుతుంది.
ప్రస్తుతం దేశంలో తీసుకున్న పెద్దనోట్ల రద్దుతో దేశీయంగా ఉన్న నల్లధనం లెక్కలు తేలుతున్నాయి. దీనికి సమాంతరంగా విదేశాల్లో ఉన్న భారతీయుల నల్లధనం వెలికితీసుకువచ్చే చర్యలు కూడా కొనసాగుతాయి. అంతర్జాతీయంగా దేశాల మధ్య ఉన్న ఒప్పందాలు, చట్టాల్లో లొసుగుల వల్ల ఈ చర్యలు కాస్త ఆలస్యమైతే కావచ్చు కానీ, ఎప్పటికైనా విదేశాల్లో దాచుకున్న నల్లధనం ఖాతాలు వెలుగు చూడటం ఖాయం. ఈ విషయంలో ప్రధాని మోదీ తీసుకునే చర్యలు కఠినంగా ఉంటాయనడంలో సందేహం లేదు. ఇదే సందర్భంలో సామాన్యులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీనికి ప్రజలనుంచి కూడా సానుకూల స్పందన లభించడం హర్షించతగ్గ పరిణామంగానే చెప్పాలి.

- కంభంపాటి హరిబాబు. ఎపి బిజెపి అధ్యక్షుడు, విశాఖ ఎంపి