ఫోకస్

పదునైన చట్టాలే సమాధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్లాక్ మనీ కలిగి ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పదునైన చట్టాలు ఉండాలి. స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలైనా ఈ దిశగా ప్రభుత్వాలు పెద్దగా చర్యలు తీసుకోలేదు. రాజకీయాలకు అతీతంగా కేంద్రంలో ఉండే ప్రభుత్వాలు నల్లధనం కలిగి ఉన్నవారిపై ఉక్కుపాదం మోపాలి. ప్రస్తుతం పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల నల్లధనం బయటపడుతుందన్న ఆశ పెద్దగా లేదు. ఆర్‌బిఐ ముద్రించిన ఐదు వందలు, వెయ్యి నోట్లలో 90 శాతం బ్యాంకులకు చేరినట్లు సమాచారం వస్తోంది. కేవలం పెనాల్టీలతో సరిపుచ్చడం సరికాదు. కేంద్రం నల్లధనం వెలికితీతకు అనేక పథకాలు పెట్టింది. 45 శాతం సొమ్మును చెల్లిస్తే 55 శాతం సొమ్ము బ్లాక్ నుంచి వైట్‌గా మార్చుకోవచ్చు. ఈ స్కీము తర్వాత ఆశించిన ఫలితాలు రాలేదని పెద్ద నోట్లు రద్దుచేశారు. దేశంలో నల్లధనం ఎంత ఉందో తెలియదు కాని, ఏ మేరకు బయటకు వచ్చిందో తెలియదు కాని, సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇక్కట్లకు లోనయ్యారు. తాజాగా నల్లధనం ఉన్నవారు తమ సొమ్మును డిపాజిట్ చేస్తే 50 శాతం చెల్లించి, మరో 25 శాతం నాలుగేళ్ల తర్వాత ఇస్తారు. ఇప్పటికిప్పుడు వచ్చేది 25 శాతం మాత్రమే అన్నారు. ఈ స్కీములు ఏ మాత్రం విజయవంతమవుతాయో వేచిచూడాలి. నగదు రహిత ఎకానమీ పూర్తిగా అమలు చేయడం సాధ్యంకాదు. భారతదేశం గ్రామీణ ప్రాంతంలో జీవిస్తోంది. నగదు లావాదేవీలు 95 శాతం అమలులో ఉంది. అటువంటప్పుడు నల్లధనం గుర్తించడం సాధ్యంకాదు. నల్లధనంతో పట్టుబడితే కఠిన శిక్షలు ఉండేవిధంగా చట్టాలు ఉండాలి. స్విస్ ఖాతాల్లో దాచుకున్న సొమ్మును బయటకు తీస్తామన్నారు. కాని ఇంతవరకు అమలు కాలేదు. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఇష్టం వచ్చినట్లు నిధులు ఖర్చుపెట్టకుండా చట్టాలు తేవాలి. నియంత్రణ ఉండాలి. నల్లధనం అనేది ఒక మహమ్మారి. దీనిని నియంత్రించాలంటే అన్ని రంగాల్లో సంస్కరణలు తేవాలి. పెద్ద నోట్ల రద్దుకు అమలు చేసిన విధానాల్లో లోపాలను సవరించి, నల్లడబ్బును దాచుకున్న వారిని గుర్తించి చట్టం ముందుకు తేవాలి

- విశే్వశ్వరరెడ్డి ఏపి వైకాపా శాసనసభాపక్ష ఉపనేత