ఫోకస్

మూలాలను ప్రక్షాళన చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లధనం వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పెద్దనోట్ల రద్దు ఏమాత్రం ఉపయోగపడదు. పైగా ఈ నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతోంది. నల్లధనం అనేది ఎంత ఉన్నదన్న విషయంలో ఇప్పటివరకు ఖచ్చితమైన లెక్కలు లేవు. అసలు నల్లధనం ఏ రూపంలో ఉందో కూడాతెలియదు. రూపాయల కట్టలను ఎవరూ కుండల్లోనో, మరోచోటనో దాచరు. ఈ డబ్బును వివిధ రంగాల్లో పెట్టుబడులుగా పెడుతుంటారు. దేశం మొత్తంలో చలామణిలో ఉన్న నగదులో నల్లధనం ఆరుశాతంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఆరుశాతంకోసం 94 శాతం ప్రజలను ఇక్కట్లకు గురిచేస్తున్నారని స్పష్టమవుతోంది. చిన్న చిన్న వ్యాపారస్థులు, చిన్న పరిశ్రమలవారు, సామాన్యుల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ఉపాధి అవకాశాలు బాగా తగ్గాయి. జిడిపిపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందనడంలో సందేహం లేదు.
1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నోట్లరద్దు, స్వతహాగా అస్తుల వెల్లడి తదితర 17 రకాల చర్యలు చేపట్టినప్పటికీ, సత్ఫలితాలు రాలేదు. అక్రమాలకు, అవినీతికి అసలు మూలాలు ఎక్కడున్నాయి అన్న అంశాలను పరిశీలించాలి. అక్రమాలకు మూలం రాజకీయ వ్యవస్థ, బ్యూరోక్రసీ, బడా పారిశ్రామికవేత్తలు ప్రధాన కారణాలు. రాజకీయ పార్టీలకు పారిశ్రామికవేత్తలు విరాళాలు ఇస్తున్నారనేది బహిరంగ రహస్యమే. రాజకీయ నాయకులు అక్రమాలకు పాల్పడితే బ్యూరోక్రసీ చర్యలు తీసుకోలేదు కదా! రాజకీయ అవినీతి, బ్యూరోక్రసీ, బడావ్యాపార పారిశ్రామికవేత్తలు అవినీతి, అక్రమాలకు ప్రధాన కారణాలుగా పేర్కొనవచ్చు. ఈ రంగాల్లో నీతివంతులు, ధర్మానికి కట్టుబడ్డవారు లేరని అనలేం. ధర్మానికి, నీతికి కట్టుబడి ఉన్నవారు ఉన్నప్పటికీ, వారి సంఖ్య చాలాతక్కువ. అవినీతికి కారణమైన ఈ మూడు రంగాలను ప్రధాని మోదీ ప్రక్షాళన చేయగలరా అన్నది ప్రధానమైన ప్రశ్న. విదేశీ బ్యాంకుల్లో కొందరు నల్లధనాన్ని దాచుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ వివరాలు ప్రభుత్వం వద్ద లేవు. పెద్దనోట్ల రద్దు తర్వాత మరికొన్ని చర్యలను కేంద్రం తీసుకుంటుందని ప్రచారం జరుగుతోంది. బంగారం తనిఖీ, రియల్ ఎస్టేట్ తదితర రంగాలు తదుపరి టార్గెట్‌గా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. మన దేశంలో 20 వేల టన్నుల వరకు బంగారం ఉంటుందని ఒక అంచనా. భారతీయ సంస్కృతిలో భాగంగా ప్రతి మహిళ కూడా ఎంతో కొంత బంగారాన్ని ఆభరణాల రూపంలో కలిగి ఉంటుంది. మరికొంత మంది పెట్టుబడిగా బంగారాన్ని కొని దాచుకుంటారు. సామాజిక భద్రతకోసం కొందరు బంగారాన్ని దాచుకుంటారు. ప్రభుత్వపరంగా ప్రజలకు సామాజికంగా ఎలాంటి భద్రత లేదు. అసంఘటిత రంగంలో ఉన్న కోట్లాది మందికి నెలకు వస్తున్న పింఛన్ 1500 నుండి 2000 రూపాయల వరకు మాత్రమే ఉంటుంది. ఈ డబ్బు ఎవరికీ సరిపోదు. విద్య, వైద్య రంగాలు అందరికీ అందుబాటులో లేవు. ఈ రెండు రంగాలు కార్పొరేట్ సెక్టార్‌లో కొనసాగుతున్నాయి. దాంతో పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందుబాటులో ఉండటం లేదు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధికోసమే ప్రధాన లక్ష్యాలుగా ఉండాలి.

- పిఎస్‌ఎం రావు, ఆర్థిక నిపుణులు