ఫోకస్

ఇబ్బందులు తగ్గుముఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్ద నోట్లు రద్దు నాటి ఇబ్బందులు నేడు లేవు.. పెద్ద నోట్లపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కొంత మేరకు ప్రజలు ఇబ్బందులకు గురైనప్పటికీ, ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం విజయవంతమైందనే చెప్పవచ్చు. నవంబర్ 8న రద్దయిన నోట్ల ప్రభావం చిన్న వ్యాపారులపై పడింది వాస్తవమే. కానీ ఓ పక్షం రోజుల్లో ప్రజలు అలవాటు పడిపోయారు. ఇక పెద్ద వ్యాపారస్థులు ఎప్పటికీ వారి లక్ష్యాలు, లావాదేవీలు పెద్దఎత్తునే ఉంటాయి. కాబట్టి వారిపై కొంతమేరకే నోట్ల ప్రభావం పడిందనుకుంటున్నాను. బ్లాక్ మనీని వెలికితీయడం మంచి చర్యే. అయితే నల్లధనం వెలికితీతతో అవినీతి రూపుమాసిపోతుందనుకోవడం కొంత మేరకు అనుమానమే. అవినీతి నిర్మూలనకే నల్లధనాన్ని వెలికితీస్తున్నామనుకుంటే తప్పులో కాలేసినట్టే. నల్లకుబేరులపై కేసులు పెట్టి, శిక్షార్హులను చేయడంలో చట్టాలు, కోర్టుల పరస్పర సహకారం అవసరం. చట్టలొసుగులతో నల్లకుబేరులు బయటపడే అవకాశం లేకపోలేదు. అవినీతి నిర్మూలనకే నోట్ల రద్దు జరిగిందనుకోవడమూ పొరపాటే. అయితే దేశ అభివృద్ధికి నల్లధనాన్ని వెలికితీయడమనేది సమంజసమే. అవినీతి రహిత సమాజంకోసం చేపట్టిన నోట్ల రద్దు.. బ్లాక్‌మనీ వెలికితీతతో అవినీతి పూర్తిగా తొలగిపోదు. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా.. కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతూనే ఉంటారు. అవినీతి నిర్మూలన, దేశ అభివృద్ధి లక్ష్యంగా నల్లధనంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్య ప్రశంసనీయమే. కేంద్రం ఇచ్చిన 50 రోజుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బందుల్లో నుంచి కూడా కొంత బయటపడ్డారు. మరో నెల రోజుల్లో సమస్యలన్నీ సమసిపోతాయి. కొత్త కరెన్సీ సర్దుబాటవుతోంది. ఇప్పటికే ప్రజలు పొదుపునకు అలవాటు పడిపోయారు. నల్లకుబేరులపై చర్య తీసుకోవాల్సిందే. ప్రభుత్వాలు పేద ప్రజల పక్షాన నిలవాల్సిందే. ప్రభుత్వాల సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చెందాల్సిందే. ఇందులో చట్టానికి లోబడైనా, చట్ట సవరణలు చేయాల్సి వచ్చినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారం ఇచ్చిపుచ్చుకోవాల్సిందే.

-పేర్వారం రాములు మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్