ఫోకస్

వ్యవస్థకు డబ్బు జబ్బు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్ద నోట్లు రద్దయిన తర్వాత దేశవ్యాప్తంగా నల్లధనం పెద్దఎత్తున వెలుగు చూస్తోంది. ఆదాయ పన్ను శాఖ ఇంతవరకూ నిర్వహించిన 734 సోదాలు, దాడుల్లో 3300 కోట్ల రూపాయిల నల్లధనం గుర్తించారు. ఇందులో 92కోట్లు కొత్త కరెన్సీ కావడం విశేషం. దీనికి సంబంధించి 3200 మందికి నోటీసులు జారీచేశారు. దీంతో పెద్దనోట్లను రద్దు చేయడంద్వారా నల్లధనాన్ని అదుపు చేస్తామని కేంద్రం చెప్పిన మాటలకు ఊతం లభిస్తోంది. వాస్తవానికి స్వల్పకాలంలో ఒక వ్యక్తి లేదా కంపెనీ ఆస్తులు అనూహ్యంగా పెరుగుతూ ఉంటే అనుమానించాల్సిందే. అది వారి ఆర్థిక సామర్థ్యానికి గీటురాయిగా పరిగణించే ఆర్థిక సిద్ధాంతానికి ప్రాచుర్యం లభిస్తున్న ఈ రోజుల్లో నల్లధనాన్ని గుర్తించడం ఒకింత కష్టమే. రాజ్యవ్యవస్థలో అన్ని అంగాలకు డబ్బు జబ్బు పట్టినపుడు నల్లధనాన్ని ఎలా నియంత్రించ గలుగుతారనేది పెద్ద ప్రశే్న. ఇటీవల తమిళనాడు ప్రధాన కార్యదర్శి విషయంలోనూ, టిటిడి బోర్డు సభ్యుడి విషయంలోనూ ప్రజలు వేస్తున్న ప్రశ్న ఇదే. రాజకీయ, ఆర్థిక సమూల సంస్కరణల ద్వారా మాత్రమే నల్లధనాన్ని అరికట్టగలమనేది నిర్వివాదాంశం. ఆర్థిక వ్యవస్థ నియంత్రణ బాధ్యతలనుండి రాజ్యం వైదొలగడంతో పాలనా ప్రక్రియ పూర్తిగా బలహీనపడిందనే భావన వ్యక్తమవుతున్న తరుణంలో మరోమారు రిజర్వు బ్యాంకును ప్రధాని పరుగులెత్తించడం ద్వారా కార్పొరేట్ ఇష్టారాజ్యానికే దేశం నడవడం లేదనే సందేశాన్ని ఇచ్చారు. నిజాయితీపరులైన వ్యాపారులనూ ఇపుడు శంకించాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆర్థిక సంస్కరణలు అద్భుతమైన సంపదను దేశంలో సృష్టించాయి. ఆర్థిక నిర్వహణ దెబ్బతిని, చాలాభాగం నల్లధనంగా మారి, దేశ పొలిమేరలు దాటిపోయిందని స్విస్ బ్యాంకు సహా విదేశీ బ్యాంకులు చెబుతున్న లెక్కలే తేటతెల్లం చేస్తున్నాయి. సరళీకరణల బాట పట్టిన తర్వాత బాగా వృద్ధిలోకి వచ్చిన రంగం -ద్రవ్య మార్కెట్లే. నల్లధనం ద్రవ్య మార్కెట్లలోకి వివిధ రూపాల్లో ప్రవేశిస్తోందని అందరికీ తెలిసిన విషయమే. ఆర్థిక వ్యవస్థలో నల్లధనం పోగుపడకుండా, మనీ లాండరింగ్ ద్వారా తిరిగి అది మనదేశ ఆర్థిక వ్యవస్థలోకి చట్టబద్ధమైన పెట్టుబడుల రూపంలో రాకుండా చూడడానికి ద్రవ్య నియంత్రణను మరింత కట్టుదిట్టం చేయకుండా మనం ఎన్ని మాటలు చెప్పినా ప్రయోజనం లేదనేది నిపుణుల వాదన. ఆ మాట కొస్తే ఆర్థిక వ్యవస్థ గాడి తప్పడానికి అనేక కారణాలున్నాయి. గనులు, ఖనిజాలు, నిక్షేపాలు, భూములు వంటి వాటిని ప్రభుత్వం ప్రైవేటు రంగానికి కేటాయించినపుడు పారదర్శకత, జవాబుదారీతనం ఏనాడో గాడి తప్పిందనే విమర్శలు లేకపోలేదు. విలువైన ప్రకృతి సంపదను కారుచౌకగా కేటాయించినపుడు అందుకు ప్రతిఫలం ప్రభుత్వాధినేతలకు అందుతోందనే మాటను కూడా గత అనుభవాల దృష్ట్యా తీసిపారేయలేం. నిజానికి ప్రభుత్వానికి విచక్షణాధికారాలు లేకుండా చూడాల్సి ఉంది. కారుచౌకగా అక్రమంగా ప్రకృతి వనరులను కేటాయించడమనే విధానంలోనే సమూల మార్పులు రావల్సి ఉంది. అపుడే ఈ అరాచకాలకు విరుగుడు పడుతుంది. డబ్బు రుగ్మతకు చికిత్స లభిస్తుంది. ఈ అంశంపై కొంతమంది ప్రముఖుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.

చిత్రం.. పాత నోట్లను మార్చుకోవడానికి బుధవారం కోల్‌కతాలోని
ఆర్‌బిఐ వద్ద వేచివున్న జనం