ఫోకస్

శాస్ర్తియంగా అమలు జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోనల్ వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే అయినప్పటికీ, చట్టబద్ధతతో శాస్ర్తియంగా అమలు జరగాలి. జోనల్ వ్యవస్థ, ముల్కి రూల్స్, 6.5 ఫార్ములా అనేది ఉద్యోగులు, ఉపాధితో కూడిన సమస్య. ఇది ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన సమస్య కాదు. రాష్ట్ర విభజన తరువాత జోనల్ వ్యవస్థను నాలుగు భాగాలుగా విభజించారు. రాష్ట్ర, జిల్లా, జోన్, మల్టీజోన్ వ్యవస్థలు అనివార్యమని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే. కానీ ప్రస్తుతం ఈ వ్యవస్థ ఉండాలా వద్దా అనే చర్చ విస్తృతంగా కొనసాగుతోంది. ఈ వ్యవస్థ ఏర్పాటుతో లాభాలున్నాయి, నష్టాలున్నాయి. ఉద్యోగులకు కొంత వెసలుబాటు కూడా దొరికే అవకాశం ఉంది. దీనివల్ల ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలు నష్టపోతాయి. ఇది కేవలం పది జిల్లాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయమని భావిస్తున్నాను. మొత్తం 31 జిల్లాలను కలుపుకుని డిగ్రీ, ఇంటర్, కళాశాలల్లోని కొందరు ఉద్యోగులు, కొన్ని కార్యాలయాలకు సంబంధించి అధికారుల బదిలీలు, పదోన్నతులు వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదురుకావచ్చు. రాష్ట్ర, జిల్లా యూనిట్లవల్ల ఉపయోగం ఉంటుందా లేదా అన్నది ప్రశ్న. వీలైతే నాలుగుకు బదులుగా 6, 7 జోన్లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. పాత జిల్లాలను యూనిట్‌గా తీసుకుంటే ఇబ్బంది ఉండదు. జోనల్ వ్యవస్థపై ప్రభుత్వ నిర్ణయం కాకుండా, ఒక ఉన్నతస్థాయి కమిటీని వేసి జోనల్ వ్యవస్థలోని లోపాలు, భవిష్యత్‌లో జరిగే పరిణామాలు వంటి వాటిపై చర్చించాలి. ఒక జోన్, ఒక జిల్లాగా ప్రత్యామ్నాయ ఏర్పాటుతో జోనల్ వ్యవస్థను ఏర్పాటుచేయాలి. రాజకీయంగా చూడకుండా ఉన్నత స్థాయి అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి జోనల్ వ్యవస్థపై శాస్ర్తియ అధ్యయనం జరగాలి. అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, కమిటీ సిఫార్సులను శాసనసభలో ప్రవేశపెట్టి చట్టసభ ఆమోదం తెలిపిన తరువాతే జోనల్ వ్యవస్థను అమలు జరపాలి.

-పి మధుసూదన్ రెడ్డి ప్రభుత్వ కళాశాలల లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు