ఫోకస్

హైదరాబాద్‌ను ఫ్రీ జోన్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉద్యోగ నియామకాలు, విద్యా రంగంలో సీట్ల కేటాయింపుకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1975కు ముందు వచ్చిన ఉద్యమాలను దృష్టిలో పెట్టుకుని ఆరు జోన్లు చేశారు. ఇప్పుడు 371-డి అమలులో ఉంది. రాష్ట్ర విభజన జరిగినా 371-డి బంధం మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలను కలిపి ఉంచుతోంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్లు ఉంటుంది. అంటే 2024 తర్వాతనే జోనల్ వ్యవస్థకు చరమగీతం పాడే అవకాశం ఉంటుంది. రాష్ట్రప్రభుత్వం అనుకుంటే 371-డి రద్దు కాదు. పార్లమెంటులో రాజ్యాంగ సవరణద్వారా మాత్రమే రద్దవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ జోనల్ వ్యవస్ధను రద్దు చేయాలన్న నిర్ణయాన్ని ప్రతిపాదించినా 2024 వరకు అమలుకాదు. తెలంగాణలో 5, 6 జోన్లు పది జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నాయి. ఇప్పుడు 21 కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల అభివృద్ధి చెందిన జిల్లా ప్రాంతాలు వెనకబడిన జిల్లాల్లోకి, వెనకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో కలిశాయి. దీనివల్ల వెనకబడిన, అణగారిన వర్గాల అభ్యర్థులు అభివృద్ధి చెందిన ప్రాంతాల అభ్యర్ధులతో పోటీపడలేరు. జోనల్ వ్యవస్థ రద్దయితే, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్, శంషాబాద్ జిల్లాలకు చెందిన అభ్యర్థులు రిక్రూట్‌మెంట్లలో మిగిలిన 27 జిల్లాల అభ్యర్థుల కంటే ముందుండి అన్ని పోస్టులు కైవశం చేసుకుంటారు. దీనివల్ల మళ్లీ అలజడి వస్తుంది. ఆంధ్రాలో అమరావతి రాజధాని ప్రాంతం 2, 3 జోన్లకు విస్తరించి ఉంది. రిక్రూట్‌మెంట్ జోనల్ వారీగా ఉంటే స్థానికులకు ప్రాధాన్యత ఉంటుంది. కృష్ణా జిల్లా వ్యక్తి, గుంటూరుకు నాన్ లోకల్, గుంటూరు వ్యక్తి కృష్ణా జిల్లాకు నాన్ లోకల్ అవుతున్నారు. కృష్ణా జిల్లారెండవ జోన్, గుంటూరు జిల్లా 3వ జోన్‌లో ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి మొత్తం ప్రాంతాన్ని ఫ్రీ జోన్‌గా ప్రకటించారు. అందువల్ల ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి న్యాయం చేసినట్లయంది. జోనల్ వ్యవస్థ దీనిని రద్దు చేసే ప్రతిపాదన, రాష్టమ్రంతా ఒకటే జోన్ అనేది ఆలోచనకు మంచిదే. కాని ఆచరణలో సాధ్యం కాదు. ప్రాంతీయ అసమానతలు, వెనకబాటుతనం ఉన్న ప్రాంతాలకు జోనల్ వ్యవస్థ ఒక వరం. దీనిని రద్దు చేయాలంటే అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఏకాభిప్రాయం రావాలి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు పరిధి నిర్ణయించి ఫ్రీ జోన్‌గా చేయాలి. అప్పుడే అన్ని ప్రాంతాల వారికి రాజధానిలో ఉద్యోగాలు చేసే అవకాశం దక్కుతుంది.

- సలాం బాబు, అధ్యక్షుడు, వైకాపా ఆంధ్ర విభాగం