ఫోకస్

రద్దు వద్దు.. మార్పు ముద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోనల్ వ్యవస్థను రద్దుచేయడం మంచిది కాదు. ఈ విధానాన్ని రద్దు చేయడాన్ని మానుకుని, ప్రస్తుతం ఉన్న విధానంలో మార్పులు, చేర్పులు చేయాలి. ఉద్యోగులు ఎవరూ జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని అడగలేదు. గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ హయాంలో తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగింది. సమైక్య రాష్ట్రంలో కోస్తా, రాయలసీమలో 13 జిల్లాలు ఉండగా, నాలుగు జోన్లు ఉండగా, తెలంగాణలో 10 జిల్లాలు ఉండగా రెండు జోన్లు ఉండేవి. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో వెనుకబడ్డ ప్రాంతాలున్నాయి. ఈ ప్రాంతాల్లో అక్షరాస్యత శాతం చాలా తక్కువ. హైదరాబాద్, చుట్టుపట్ల అక్షరాస్యత శాతం ఎక్కువ. దాంతో వెనుకబడ్డ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు హైదరాబాద్‌లోని అభ్యర్థులతో పోటీ పడేందుకు ఇబ్బంది ఎదుర్కొనేవారు. ఈ పరిస్థితిలో జోనల్ వ్యవస్థను రద్దు చేస్తే హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన అభ్యర్థులే ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాజధాని హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో శిక్షణా కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కేంద్రాల్లో శిక్షణ పొందిన అభ్యర్థులే సహజంగా పోటీ పరీక్షల్లో ముందుంటారు. ఉద్యోగాలకు సంబంధించి జిల్లాస్థాయి, మల్టీజోనల్‌స్థాయి, రాష్టస్థ్రాయిలుగా విభజించాలి. ప్రస్తుతం తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. 10 జిల్లాలు 31 జిల్లాలుగా మారాయి. పరిపాలనాపరంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తీసుకున్న ఈ చర్య అందరి ప్రశంసలు పొందింది. పరిపాలన వికేంద్రీకరణ జరిగినట్టే జోనల్ వ్యవస్థను కూడా వికేంద్రీకరించాలి. రెండు జోన్లను విస్తృత పరచాలి. వెనుకబడ్డ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకోవాలి. అక్షరాస్యతను దృష్టిలో ఉంచుకోవాలి. విద్యాపరంగా వెనుకబడ్డ ప్రాంతాలను, వెనుకబడ్డ జిల్లాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి సముచిత నిర్ణయం తీసుకోవాలి. వెనుకబడ్డ ప్రాంతాల నిరుద్యోగులకు న్యాయం జరిగేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలి. జిల్లాస్థాయిలో క్లాస్-4, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ పోస్టులుంటాయి. ఉన్నతస్థాయి పోస్టులు జోనల్, స్టేట్‌లెవెల్‌ల్లో ఉంటాయి. తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాలు, నీరు, నిధులపై ఆధారపడ్డదన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగాల్లో గతంలో తెలంగాణకు జరిగిన అన్యాయం, తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాల నిరుద్యోగులకు జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. వెనుకబడ్డ ప్రాంతాల అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని జోనల్ వ్యవస్థను రద్దు చేయకుండా, పునర్వ్యవస్థీకరిస్తే మంచిది. ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.

- ఎం. శివశంకర్ అధ్యక్షుడు, తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం