ఫోకస్

ఎవరికీ అన్యాయం జరుగవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం వారికి ఉద్యోగ నియామకాలలో అన్యాయం జరుగకుండా జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో ఇంకా జోనల్ వ్యవస్థను కొనసాగించాల్సిన అవసరం లేదు. అలాగని జోనల్ వ్యవస్థ రద్దువల్ల తిరిగి రాష్ట్రంలో మరెవరికీ అన్యాయం జరుగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. జోనల్ వ్యవస్థ రద్దు తర్వాత రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలైన మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో పాటు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో వెనుకబడిన కొన్ని ప్రాంతాలకు అన్యాయం జరుగకుండా జాగ్రత్తగా నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉంది. దానికిముందు జోనల్ వ్యవస్థ రద్దువల్ల తలెత్తబోయే పరిణామాలపై లోతుగా అధ్యయనం జరగాలి. ఈ అంశంపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, న్యాయ నిపుణులతో ప్రభుత్వం చర్చించాలి. జోనల్ వ్యవస్థలో జిల్లా, జోనల్, రాష్ట్రం మూడు కేటగిరీలు ఉన్నాయి. జిల్లా కేడర్‌లో 85 శాతం స్థానికులకు, 15 శాతాన్ని మెరిట్‌కు (ఒపెన్ కోటా), జోనల్ కేడర్‌లో స్థానికులకు 70 శాతం, ఒపెన్ కోటాకు 30 శాతం, స్టేట్ కేడర్‌లో 60 శాతం స్థానికులకు, ఒపెన్ కోటాకు 40 శాతం కేటాయించారు. భవిష్యత్‌లో జిల్లా, రాష్ట్రం రెండే రెండు కేడర్లు ఉండబోతుండటంతో జిల్లా కేడర్‌లో వంద శాతాన్ని స్థానికులకు కేటాయించి, రాష్ట్ర కేడర్‌లో 85 శాతాన్ని స్థానికులకు కేటాయించి 15 శాతాన్ని ఓపెన్ కేటగిరీగా ఖరారు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంఘం తరఫున ఇదివరకే సబ్ కమిటీ ముందు వాదనలను వినిపించాం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ట్యాగ్‌లైన్ నిధులు, నియామకాలు, నీళ్లు. ఇందులో ప్రధానమైంది నియామకాలు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సొంత రాష్ట్రంలో కూడా తమకు అన్యాయం జరిగిందన్న భావన కానీ, జిల్లాల మధ్య వివక్షత కానీ జరిగిందన్న అభిప్రాయం తలెత్తకుండా జాగ్రత్తగా విధివిధానాలను రూపొందించాలి.

- ఎ పద్మాచారి అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యోగుల సంఘం