ఫోకస్

జోనల్ వ్యవస్థ వద్దా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్రంలో జోనల్ వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు. ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నాయకులు భిన్నంగా స్పందించారు. గెజిటెడ్ అధికారుల సంఘం ఒక రీతిన, మిగిలిన ఉద్యోగ సంఘాల నాయకులు వేరేరీతిన స్పందించారు. ఆంధ్రాలోనూ తెలంగాణ మాదిరి జోనల్ వ్యవస్థ రద్దు చేయాలనే డిమాండ్ వస్తోంది. జోనల్ వ్యవస్థను ఒక కోణంలో చూస్తే ఉద్యోగులకు పటిష్టమైన భద్రత కనిపిస్తుంది, మరో కోణంలో చూస్తే ప్రభుత్వానికి ఇరకాటమైన వ్యవహారమే. ఒక జోన్‌లో పనిచేసే ఉద్యోగిని మరో జోన్‌కు బదిలీచేయడం ప్రభుత్వానికి సాధ్యం కాదు. ఉద్యోగుల్లో నిర్లిప్తత, సాచివేతను తొలగించి వారిపై కఠిన వైఖరి అవలంభించాలంటే జోనల్ వ్యవస్థ ప్రభుత్వానికి అడ్డంకిగానే మారింది. తెలంగాణలో కొత్తగా 31 జిల్లాలు ఏర్పాటైన తర్వాత జోనల్ వ్యవస్థ అమలు సాంకేతిక సమస్యలతో జఠిలం అయింది. 1956 వరకూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండేది. నిజాం పాలనలో స్థానికులకే ఉద్యోగాలివ్వాలని ప్రజలు ఉద్యమిస్తే 1919లో ముల్కీ నిబంధనలు అమలుచేయడంలో 1948 వరకూ ఇండియన్ యూనియన్‌లో కలిసేవరకూ నిరాటకంగా అమలులో ఉన్నాయి. 1952లో గైర్ ముల్కీ ఉద్యమం జరిగింది. బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం ముల్కీ ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఈలోపే తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలు విలీనం అయ్యాయి. అక్కడినుండి స్థానికత అంశంపై వివాదాలు కొనసాగినా, 1972లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముల్కీ నిబంధనలు సబబేనని తీర్పునిచ్చింది. అప్పట్లో ప్రధాని ఇందిరాగాంధీ ఆరు సూత్రాల పథకానికి ప్రతిపాదించారు. 32వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోని 371డి ఆర్టికల్‌ను పొందుపరిచి 1975లో రాష్టప్రతి ఉత్తర్వులు ఇచ్చారు. దీని ప్రకారం తెలంగాణ రెండు జోన్లుగా మారింది. ఇతర ప్రాంతాలవారు ఉద్యోగాల్లో నియమితులవుతున్నారనే వివాదంపై 610 జీవో కూడా జారీ అయ్యింది. జోనల్ వ్యవస్థ రద్దుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని జీవోలు ఇస్తే సరిపోదని, కొత్త వ్యవస్థకు జీవం పోసేముందు ముల్కీ నిబంధనలు ఉద్దేశ్యాలు పొందుపరచాలని టిఎస్‌పిఎస్‌సి సభ్యుడు విఠల్ వంటి నిపుణులు చెబుతున్నారు. నాలుగేళ్ల నియమాన్ని రద్దు చేసి తాను చదువుకున్న కాలం కాకుండా తల్లి లేదా తండ్రి పదిహేనేళ్ల నివాసాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. జిల్లా జోనల్ పోస్టులు జిల్లా పరిధిలోకి, రాష్టస్థ్రాయి పోస్టులు రాష్ట్ర పరిధిలోకి తేవాలని అలాగే జిల్లాల మధ్య సమన్యాయం పాటించాలని నిపుణులు చెబుతున్నారు. కొత్త విధానానికి రాజ్యాంగ రక్షణ కల్పించాలని, లేకుంటే ఈ జీవోలు కోర్టుల్లో నిలవవనేది వారి వాదన. కొన్ని సంఘాలు మాత్రం ఈ ఆలోచనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రెండు జోన్లకు బదులు తెలంగాణ రాష్ట్రాన్ని ఆరు జోన్లకు పునర్వ్యవస్థీకరించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య, ఎస్‌టియు తదితర సంఘాలు కోరుతున్నాయి. వెనుకబడిన జిల్లాల్లోని నిరుద్యోగులు విద్యావకాశాల్లో ముందున్న జిల్లాలవారితో పోటీపడగలరా అని ఆ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో జోనల్ వ్యవస్థపై నిపుణులు, ఉద్యోగ సంఘాల నేతల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.