ఫోకస్

ఆహ్వానించదగినదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైద్య విద్యార్థులకు ఒకే టెస్టు ఉంది. అందుకు ‘నీట్’ నిర్వహించడం ఆహ్వానించదగ్గ విషయం. ఇదే స్థాయిలో ఇంజనీరింగ్ పరీక్ష విధానం కూడా కొనసాగితే బాగుండేది. మెడికల్‌కు ఒకే టెస్టు, కాగా ఇంజనీర్‌కు దాదాపు పది టెస్టులుంటాయి. ఇంజనీరింగ్‌కు అర్హత పరీక్ష మాటున పలు కళాశాలలు పలు రకాలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒక కళాశాల ఒక్కో అభ్యర్థి నుంచి రూ.3వేలు వసూలు చేస్తే, మరో కళాశాలలు రూ.వెయ్యి నుంచి 2వేలు వసూలు చేస్తారు. ఇలా దాదాపు రెండు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారు. దీంతో మొదటగా ఆయా కళాశాలల యాజమాన్యాలు దాదాపు రూ.60 కోట్లు వసూలు చేస్తారు. వైద్య విద్యార్థులకు మాదిరిగానే ఇంజనీర్ విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించాలి. ఎలిజిబుల్ టెస్టులో ఒకే విధానం అనుసరించాలి. తద్వారా అభ్యర్థులకు సమయం ఆదాతోపాటు డబ్బు పొదుపవుతుంది. కాబట్టి ఎలిజిబుల్ టెస్టు విధానం మారాలి. అభ్యర్థుల మానసిక పరివర్తనకు అనుగుణంగానే ప్రశ్నపత్రం రూపొందించాలి. కానీ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక ఇంజనీర్ అభ్యర్థికి పలు కాలేజీలు పలు రకాల సిలబస్, ప్రశ్నపత్రాలు రూపొందిస్తున్నారు. దీంతో విద్యార్థుల మానసిక సామర్థ్యం అంచనా వేయలేక వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఇంజనీరింగ్ అర్హత పరీక్షలో మార్పులు రావాలి. శాస్ర్తియ విధానాన్ని అమలుపరిచేలా చర్యలు తీసుకోవాలి. ఒక పేద విద్యార్థి ఇంజనీర్ సీటు కోసం రూ.3వేలు చెల్లించి, పరీక్ష రాసే కేంద్రానికి చేరుకునేసరికి మరో వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ప్రైవేటు విద్యాసంస్థలకు ప్రభుత్వం ఎకరాల కొద్దీ స్థలాలు ఇస్తోంది. ఇది ప్రజల ఆస్తి కాదా? అలాంటప్పుడు కళాశాలల్లో అర్హత, ప్రవేశ పరీక్షలపై ఆంక్షలు విధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సామాన్యులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వైద్యం, ఇంజనీరింగ్ విద్యపై శాస్ర్తియ విధానాన్ని తీసుకురావాలి. అందరికీ విద్య అందించేందుకు కృషిచేయాలి.

- గన్‌రెడ్డి రాజారెడ్డి లోక్‌సత్తా, నేషనల్ ఫైనాన్స్ కమిటీ చైర్‌పర్సన్