ఫోకస్

కమిషన్ ఏర్పాటు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఇచ్చే సెంటర్ల నియంత్రణకు ఒక రెగ్యులేటరీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. కోచింగ్ సెంటర్లు ప్రజలనుంచి డబ్బులు దోచుకుంటున్నాయి. ప్రతి ప్రవేశపరీక్షకు కోచింగ్ సెంటర్లు పుట్టుకొస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కోచింగ్ సెంటర్లు అడ్డూ అదుపులేకుండావిస్తరిస్తున్నాయి. దీనివల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు దెబ్బతింటున్నారు. పైగా విద్యార్థుల స్వేచ్చ, మానసిక వికాసాన్ని ఈ సెంటర్లు నిరోధిస్తున్నాయి. ప్రవేశపరీక్షలను పాఠశాల స్థాయిలో నిర్వహించరాదని సుప్రీం కోర్టు చెప్పినా ఎవరు పట్టించుకుంటున్నారు? ఈ రోజు హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, వరంగల్ నగరాల్లోల కానె్వంట్లకు కూడా ప్రవేశపరీక్షలను నిర్వహిస్తున్నారు. లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు. ఎల్‌కెజి, ఒకటో తరగతికీ ప్రవేశపరీక్షలా? ఈ విషయంలో తల్లితండ్రులను కూడా తప్పుబట్టాలి. ప్రభుత్వ పాఠశాలలు కుప్పకూలుతున్నాయి. ఇక్కడ విద్యా వ్యవస్ధ నాశనం కావడానికి ప్రభుత్వం, ఉపాధ్యాయులు, తల్లితండ్రులు కారణమని చెప్పవచ్చు. ఇక సైనిక పాఠశాల, నవోదయ స్కూళ్ల కోచింగ్ సెంటర్ల సంగతి చెప్పనక్కరర్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో తల్లితండ్రులు తమ పిల్లలకోసం లక్షల్లో అప్పులు చేస్తున్నారు. గురుకుల పాఠశాలల కోచింగ్ సెంటర్లు కూడా ఉన్నాయి. కోచింగ్ సెంటర్లలో చేరకపోయినా, స్వయం ప్రేరేపిత ఉత్సాహంతో చదివి పాసు కావాల్సిన పరీక్షలకు కోచింగ్ సెంటర్లు వచ్చాయి. ఇక సివిల్స్ పరీక్షలకు కూడా పుట్టగొడుగుల్లా కోచింగ్ సెంటర్లు వచ్చాయి. ఇక్కడకూడా విద్యార్థులను గంటలకొద్దీ కూర్చోబట్టి బోధిస్తున్నారు. లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇంజనీరింగ్, మెడిసెన్ కోర్సులకు ప్రవేశపరీక్షల సంగతి చెప్పనక్కర్లేదు. కొన్ని వేల కోట్ల రూపాయల టర్నోవర్‌తో కోచింగ్ సెంటర్లు నడస్తున్నాయి. వీటిపైన నియంత్రణ లేదు. ఆదాయం పన్ను శాఖకు పన్ను చెల్లించరు. ఉత్తర భారతంలో ప్రవేశపరీక్షల కోలాహలం ఇంత ఉండదు. దక్షిణ భారత్‌లో అందునా ఆంధ్ర, తెలంగాణలో ప్రవేశపరీక్షలు ఎక్కువ. ప్రవేశపరీక్షల వ్యవస్థను కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రక్షాళన చేయాలి. విద్యా నిపుణులతో కమిటీలను వేయాలి. దేశంలో సగం జనాభా దారిద్య్రంతో ఉండగా, వారికి అందుబాటులో కోర్సులు ఉండడం లేదు. కొన్ని ప్రవేశ పరీక్షలకోసం పిల్లలనుచదివించేందుకు తల్లితండ్రులు అప్పులు చేసి దివాళాతీసిన సంఘటనలు కోకొల్లలు. కోచింగ్ సెంటర్లలో మనోవికాసానికి సంబంధించిన అంశాలను బోధించరు. ఎంతసేపు విద్యార్థుల చేత బట్టీ పట్టిస్తారు. దీనివల్ల విద్యార్థులు మనసు, మెదడుతో ఆలోచించే శక్తిని కోల్పోతున్నారు. ప్రవేశపరీక్షల భయంతో చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒక విద్యార్థి ఏ రంగంలో రాణిస్తారో గుర్తించే స్థితిలో మన విద్యా వ్యవస్థ లేదు.

- ఎస్ సలాం బాబు, అధ్యక్షుడు, ఏపి వైకాపా విద్యార్థి సంఘం