ఫోకస్

జాతీయ స్థాయిలో ఉమ్మడి పరీక్ష కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైద్యం, ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించి జాతీయస్థాయిలో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉండాలి. మెడిసిన్, ఇంజనీరింగ్ కోర్సులకు కామన్ సిలబస్, కామన్ ఎంట్రన్స్ టెస్టులను నిర్వహించి ప్రవేశాలు కల్పించాలి. ప్రస్తుతం కొనసాగుతున్న విద్యావిధానం చదుకు‘కొనే’వారికే ఉపయోగకరంగా ఉంది తప్ప బడుగు, బలహీన వర్గాలకు ఉన్నత విద్య అందుబాటులో లేదు. ఇంటర్మీడియట్ విద్య తర్వాత ఇంజనీరింగ్‌లో ప్రవేశం పొందాలనుకుంటున్న విద్యార్థులు ఎంసెట్ మెయిన్స్, జెఇఇ అడ్వాన్స్, గీతం, విఐటి, ఎస్‌ఐటి తదితర పది రకాల ప్రవేశపరీక్షలను రాసేందుకు 20వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతోపాటు తీవ్రమైన మానసికవత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తోంది. తమ కాలేజీల్లో చేరితే ఐఐటి గ్యారంటీ, మెడిసిన్ గ్యారంటీ లేదా ఫీజు వాపస్‌లాంటి మోసపూరిత ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ప్రజల బలహీనతలను పెట్టుబడిగా పెట్టి విద్యముసుగులో కొన్ని కార్పొరేట్ సంస్థలు ఐసిఐ, ఐకాన్, నియో, ఎంఇపి లాంటి కోర్సుల పేరుతో కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకోవాలి. జాతీయస్థాయిలో ఇంటర్‌మీడియట్ కోర్సుకు ఎన్‌సిఇఆర్‌టి రూపొందించిన సిలబస్‌ను అమలు చేసి, ఇప్పుడున్న ఎంసెట్, జెఇఇ తదితర పోటీ పరీక్షల స్థానంలో ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించాలి. ఈ పరీక్ష ఆధారంగా ర్యాంకులు ప్రకటించి ఇంటర్ తర్వాతి కోర్సులైన మెడిసిన్, బిటెక్, డిగ్రీకోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలి. పట్టణ ప్రాంతాల విద్యార్థులకు గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల మధ్య అంతరాన్ని తగ్గించి అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు 6 నుండి 12 వతరగతి వరకు గ్రామీణ ప్రాంతాల్లో చదివేవారికి, మరీ ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే గ్రామీణ విద్యార్థులకు మెడిసిన్, బిటెక్, డిగ్రీ కోర్సుల్లో కొంత వెయిటేజీ కల్పించాలి.

- యం. వేణు, ఎఐఎస్‌ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు