ఫోకస్

విద్యార్థులతో చెలగాటం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఎంట్రన్స్ పరీక్షల్లో తప్పులు దొర్లుతున్నాయి. గందరగోళ పరిస్థితులు నెలకొని మెరిట్ విద్యార్థులు నష్టపోతున్నారు. పరీక్షల నిర్వహణలో తరచూ గందరగోళం నెలకొనడం, ఆ ఎంట్రన్స్‌లు వాయిదాలు పడుతుండడంతో మెరిట్ విద్యార్థులు మానసికంగా కృంగిపోతున్నారు. ఇందుకు కారణం ప్రభుత్వ వైఫల్యమే. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పొరపాట్లు జరగవు, తప్పలు దొర్లవు. తప్పులు జరిగినప్పుడు వాటిని సరి చేసుకునే ప్రయత్నం చేయకుండా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైనా పొరపాటు జరగవచ్చు. లోగడ జరిగిన వాటిని అనుభవంలోకి తీసుకుని భవిష్యత్తులో అటువంటివి జరగకుండా చూసుకోవాలి. కానీ తమ తప్పును ఒప్పుకోకుండా, కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. పొరపాటు జరిగిందని, దీనిని సరి చేసుకుంటామని, భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని చెబితే హుందాగా ఉంటుందన్న విషయాన్ని ఈ ప్రభుత్వం గమనించడం లేదు. అలాగే సంబంధిత మంత్రి సక్రమంగా సమీక్షించడం లేదనేది స్పష్టమవుతున్నది. ప్రశ్నా పత్రం తయారీ మొదలుకుని ముద్రణ, పరీక్ష నిర్వహణ, కరెక్షన్, ఫలితాల వెల్లడయ్యేంత వరకూ అప్రమత్తంగా ఉండాలి. కానీ సంబంధిత మంత్రి బ్యూరోక్రాట్లపై ఆధారపడడం వల్లే అనర్థాలు జరుగుతున్నాయి. మంత్రి జాగ్రత్తగా ఉంటే ఇబ్బందులు ఉండవు. గందరగోళం జరగదు. గత ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు నిర్వహించిన ఎంట్రెన్స్‌ల్లో గందరగోళం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరానికైనా ప్రభుత్వం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం మంచిది కాదు. ప్రతి ఏడాది తప్పని సరిగా నిర్వహించాల్సి ఉన్న ఎంసెట్, లాసెట్ వంటి ఎంట్రన్స్‌లనే ప్రభుత్వం నిర్వహిస్తున్నదే తప్ప డిఎస్‌సి, పబ్లిక్ సర్వీసు కమిషన్ పరీక్షలు నిర్వహించకుండా కాలాయాపన చేస్తున్నది. దీంతో నిరుద్యోగుల్లో నిరాశా పెరుగుతోంది. కాబట్టి ఆ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి.

- డాక్టర్ వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు