ఫోకస్

విధాన నిర్ణేతల ఆలోచనల్లో లోపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరీక్షల గందరగోళానికి విద్యాసంస్కరణల విధాన నిర్ణేతలలో అస్పస్టతే కారణమనేది సుస్పష్టం. పరీక్షల్లో సంస్కరణలు కేవలం మార్పులకే పరిమితం కారాదు, ఆ మార్పులు నిజమైన కొత్త మార్గానికి బాటలు వేయాలి. ప్రవేశపరీక్షల్లో కొత్త పద్ధతి పెట్టడంతో సరిపోదు, కాని దాని ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారో ముఖ్యం. ఈ క్రమంలోనే జాతీయస్థాయిలో నీట్ పరీక్షను కేంద్రం ప్రవేశపెట్టింది. ఇది చాలా మంచి నిర్ణయం, స్వాగతించదగిందే, కాని దానిని కూడా కొన్ని కోర్సులకు, కొన్ని సంస్థలకే పరిమితం చేయడం సరికాదు. మెడికల్ దాని అనుబంధ కోర్సుల్లో ప్రవేశానికి కూడా నీట్‌ను తప్పనిసరి చేసి ఉంటే బావుండేది, ఎఎఫ్‌ఎంసి, ఎయిమ్స్, జిప్‌మర్ లాంటి సంస్థల్లో కూడా ఇదే స్కోర్ ఆధారంగా సీట్ల భర్తీ చేస్తే బావుండేంది. అలా చేయకపోవడం వల్ల నీట్ లక్ష్యం కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. మిగిలిన కోర్సులకు మరికొన్ని ప్రవేశపరీక్షలు రాయాల్సి వస్తోంది. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటి రెండు పరీక్షల ఆధారంగానే సీట్ల కేటాయింపు జరుగుతోంది. అదే తరహాలో మనం కూడా చేయలేమా? ఆలోచిస్తే చేయగలమనే అనిపిస్తోంది. కేవలం పాఠ్యాంశాల్లో సత్తా చూసి సీట్లు ఇవ్వడం సరైంది కాదు, విద్యార్ధి వౌలిక లక్షణాలు, మానసిక పరిపక్వత కూడా సబ్జెక్టుతో పాటు పరీక్షించబడాలి. సామాజిక ఔత్సాహికత కూడా పరీక్షించబడాలి. ఆ అంశాలను ఇపుడు భారత్‌లో చూడటం లేదు. వాటిని కూడా అంతా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అందుకు అమెరికా వంటి దేశాల్లో విద్యార్ధిని పరీక్షించడం జరుగుతుంది. మనం కూడా అభ్యర్ధి రీడింగ్ హేబిట్ మొదలు అన్ని అంశాలు పరీక్షించాలి. నేడు ఉద్యోగం చేయాలంటే కేవలం చదువుతో సరిపోదు, వారికి వాక్చాతుర్యం, వ్యక్తీకరణ సత్తా, సమూహాన్ని ఎదుర్కొనే అనుభవం, సమస్యల పరిష్కార సామర్ధ్యం వంటి గుణాలు కూడా ఉండాలి. మార్కెట్ శాసించే రోజులు వచ్చాయి. వాస్తవానికి ఎమ్సెట్ తరహా పరీక్షలు ఇంటర్ పూర్తయితేనే నిర్వహించాలనేమీ లేదు. 11వ తరగతిలోనే ఎమ్సెట్ నిర్వహించవచ్చు. 6వ తరగతి నుండి 11వ తరగతి వరకూ ఉన్న సిలబస్ ఆధారంగా ఈ పరీక్ష పెట్టుకోవచ్చు. ఇలాంటి అంశాలను అంతా ఆలోచించాలి. ఇంటర్ కంటే ముందే ఈ పరీక్ష పెట్టుకోవచ్చు. పరీక్ష ముందుగానే నిర్వహిస్తే మంచి విద్యాసంస్థలను ఎంచుకోవడం అభ్యర్ధులకు తేలిక అయిపోతుంది. అపుడే వారు సరైన ఆప్షన్లు ఇవ్వగలుగుతారు. హడావుడిగా ఆప్షన్లు ఇవ్వడం వల్ల అభ్యర్ధులకు తీరని నష్టం వాటిల్లుతోంది. మంచి సంస్థలను ఎంచుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది, వీటన్నింటికీ ప్రవేశపరీక్షలతోనే లంగురు ఉంది.

- చుక్కా రామయ్య శాసనమండలి మాజీ సభ్యుడు