ఫోకస్

జాతీయ స్థాయ పరీక్షలే మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలు రాస్తున్న లక్షలాది మంది విద్యార్థులు ఏదో ఒక కోర్స్‌లో ఉత్తీర్ణులు అయినవారే. అయితే ఈ లక్షలాది మంది విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించటాన్ని చూస్తే ప్రభుత్వం తను ఇచ్చిన డిగ్రీలను తనే గుర్తించనట్టు లెక్క. వాస్తవానికి ప్రభుత్వం గుర్తించిన విద్యాసంస్థలలో కోర్స్‌లను పూర్తిచేసిన వారికి విధిగా ప్రవేశ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదు. పోనీ ప్రవేశ పరీక్షలను అయినా ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహిస్తుందన్న నమ్మకం లేదు. ఎంసెట్‌లో ర్యాంకుల కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థను కార్పొరేట్ విద్యాసంస్థలు శ్రీచైతన్య, నారాయణ, వెలాసిటీలు శాసిస్తున్నాయి. ఈ సంస్థలు తయారు చేసిన ప్రశ్నపత్రాలతో ప్రవేశ పరీక్షలను నిర్వహించే దుస్థితిలో ప్రభుత్వం ఉంది. ఈ పరిస్థితులలో జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షలు ఉండాల్సిందే. ఈ విధంగానైనా కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలకు అడ్డుకట్ట వేసినట్టు అవుతుంది. కార్పొరేట్ విద్యాసంస్థలను నియంత్రించని పక్షంలో విద్యార్థులకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ప్రవేశ పరీక్షలలో నెగ్గుకు రావాలంటే కార్పొరేట్ చదువు కావాల్సిందేనన్న అభిప్రాయాన్ని తొలగించడానికి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం నిర్వహిస్తున్న స్టడీ సర్కిళ్లలో కూడా మంచి కోచింగ్ ఇప్పించడం వల్ల కార్పొరేట్ విద్యాసంస్థలలో చదువుకునే స్థోమత లేని పేద విద్యార్థులు కూడా ప్రవేశ పరీక్షలలో విజయం సాధించగలరు. విద్యావ్యవస్థలో కార్పొరేట్ విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్ల పెత్తనాన్ని పూర్తిగా రూపుమాపి, ప్రభుత్వ విద్యాసంస్థలో విద్యా ప్రమాణాలను పెంచగలిగే పక్షంలో అసలు ప్రవేశ పరీక్షలను పెట్టాల్సిన అవసరమే ఉండదు.

- జవ్షాజి దిలీప్ ఎబివిపి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు