ఫోకస్

మంచి మార్గం ఎంచుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యావ్యవస్థలోనే సంస్కరణలు రావలసిన అవసరం ఏర్పడింది. పరీక్షలు, ప్రవేశపరీక్షలే కాదు, మానవీయ సమాజాన్ని నిర్మించేందుకు అవసరమైన మానవ వనరులను తయారుచేయడంలో విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయనేది ప్రస్తుత తరాన్ని చూస్తుంటే మనకు తెలిసిపోతోంది. లక్షలాది మంది గ్రాడ్యుయేట్లు, పోస్టుగ్రాడ్యుయేట్లు వస్తున్నారు. మంచి విద్యాసంస్థల్లో చదివిన కొద్దిమందికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి. బాగా చదువుకున్న వారు, మంచి నైపుణ్యం ఉన్నవారు స్వీయ సంస్థలపై దృష్టిపెడుతున్నారు, మరికొంత మంది విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఎటూ ఎలాంటి ఉపాధి దక్కనివారు మాత్రం దేశంలోనే ఉంటున్నారు. అటువంటి వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నిరుద్యోగం యువత తప్పు కాదు, నిరుద్యోగం లేని రీతిలో వారిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఈ సమాజానిదే, ఎప్పటికపుడు వారికి నైపుణ్యాలను నేర్పించి కౌశలాలను అందించాల్సిన విద్యాసంస్థలు అందుకు తగ్గట్టు వ్యవహరించకపోవడం వల్లనే కళాశాలలు డిగ్రీల ఫ్యాక్టరీలుగా మారుతున్నాయి. దేశంలో లెక్కమీద మాత్రమే విద్యార్ధుల సంపూర్ణ వ్యక్తిత్వవికాసాన్ని తీర్చిదిద్దే విశ్వవిద్యాలయాలున్నాయి. వాటిని విద్యార్థులు గుర్తించి వాటిలో చేరినపుడు మాత్రమే వారి లక్ష్యాలను సాధించుకుని, ఆశయాలను ఆకాంక్షలను నెరవేర్చుకోగలుగుతారు. కేవలం డిగ్రీలకు పరిమితమైతే అటువంటి వారికి డిగ్రీలే మిగులుతాయి. డిగ్రీతోపాటు సామాజిక బాధ్యతను సాంస్కృతిక, మానసిక, రాజకీయ చైతన్యాన్ని అందించడం, మంచి వ్యక్తిగా తీర్చిదిద్దడం కూడా ఈ సమాజం బాధ్యతే. సమాజం కోరుకున్న వ్యక్తులను తయారుచేయాల్సిన బాధ్యత ఆయా విద్యాసంస్థలకే ఉంటుంది. అందుకే మంచి విద్యా సంస్థలను ఎంచుకునే దశలో విద్యార్థులు చాలా తెలివిగా వ్యవహరించాలి. చేరబోయే విద్యాసంస్థ పూర్వపరాలు, వారి కార్యకలాపాలు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అపుడే వారు మంచి విద్యాసంస్థలను అందిపుచ్చుకుంటారు.

- ప్రొఫెసర్ జి సూర్యనారాయణ, మాజీ చైర్మన్, ఎపిపిఎస్‌సి