ఫోకస్

ఒకే దేశం.. ఒకే పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రవేశపరీక్షల కాలం మొదలైంది. ఎల్‌కెజిలో ప్రవేశం మొదలు యుజి, పిజి, ఎంఫిల్, పిహెచ్‌డి వరకూ సామాజిక, వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో సీటు పొందాలంటే ప్రవేశ పరీక్ష రాయాల్సిందే. రెగ్యులర్ పరీక్షలతోపాటు తదుపరి ఉన్నత చదువులకు మరో అదనపు ప్రవేశపరీక్ష రాయడం అనివార్యమైంది. గతంలో ఒకటి రెండు విశ్వవిద్యాలయాల పరీక్షలకు హాజరైతే కనీసం ఏదో ఒక దాంట్లో సీటు వస్తుందనే భరోసా ఉండేది, కాని నేడు పరిస్థితి మారిపోయింది. సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతోపాటు పోటీతత్వం ఎక్కువకావడంతో సరిహద్దులు దాటి వేరే రాష్ట్రాలు, వేరే దేశాలలో ప్రవేశపరీక్షలకు విద్యార్థులు హాజరవుతున్నారు. ప్రవేశపరీక్షలు ఎక్కడ జరిగినా, అందులో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తమ ప్రత్యేకతను ఎపుడూ చాటుకుంటూనే ఉంటారు. దానికి కారణం జాతీయ స్థాయి ప్రవేశపరీక్షలకు మించి వారి సన్నద్ధత ఉండటమే. ఇంతగా తర్ఫీదు పొందుతున్నా ఒక్కో విద్యార్థి కనీసం అరడజను ప్రవేశపరీక్షలకు హాజరుకావాల్సి వస్తోంది. మెడికల్ స్ట్రీంలో ఉన్న వారు ఒక పక్క నీట్, జిప్‌మర్, ఆర్మీ మెడికల్ కాలేజీ ప్రవేశపరీక్ష, ఎయిమ్స్ ప్రవేశపరీక్షతోపాటు తెలంగాణలో అగ్రికల్చర్ స్ట్రీం ఎమ్సెట్, ఆంధ్రాలో అగ్రికల్చర్ స్ట్రీం ఎమ్సెట్‌కు హాజరుకావల్సి వస్తోంది. అదే సిబిఎస్‌ఇ విద్యార్థులైతే అదనంగా వారు ఇంజనీరింగ్ స్ట్రీం ప్రవేశపరీక్షలు కూడా హాజరుకావాల్సి వస్తోంది. అదే పరిస్థితి ఇంజనీరింగ్ స్ట్రీం చదివే విద్యార్థులకు కూడా ఉంది. ఎమ్సెట్‌లతో పాటు ఆయా ప్రసిద్ధ ప్రైవేటు కార్పొరేట్ యూనివర్శిటీలు నిర్వహించే ప్రవేశపరీక్షలతోపాటు జెఇఇ మెయిన్స్, అడ్వాన్స్ పరీక్షలకు హాజరుకావాలి.
రోజురోజుకూ విద్యార్థులపై భారం తగ్గించాలని, వ్యయం కుదించాలనే భావనతో జాతీయ స్థాయిలో ఒకే ప్రవేశపరీక్ష నిర్వహించాలనే సదుద్ధేశంతో ఐఐటి జెఇఇ, నీట్ ప్రవేశపరీక్షలు రూపుదిద్దుకున్నాయి. అయినా సహజసిద్ధమైన ఈతిబాధలు విద్యార్థులకు తప్పడం లేదు. ఒకే దేశం-ఒకే ప్రవేశపరీక్ష అనుకున్నపుడు ఇన్ని ప్రవేశపరీక్షలు ఎందుకు నిర్వహించడం? పరీక్షలు రాసేందుకు వేల, వందల కిలోమీటర్లు దూరం విద్యార్థులు ప్రయాణించి బాధలు పడటం ఎందుకు? పరీక్షలు పూర్తయ్యాక అడ్మిషన్ల కౌనె్సలింగ్‌కు మళ్లీ వెళ్లడం ఎందుకు? దేశం అంతా డిజిటల్ రూపంలోకి మారుతున్న తరుణంలో ఇంత వ్యయ ప్రయాసలు అవసరమా? వాస్తవానికి ప్రతి విద్యార్థి ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్ పరీక్ష రాసే వెసులుబాటు ఉన్నపుడు కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్షను విస్మరించి మిగిలిన సమస్యలు ఎందుకు? దేశంలో ఇంజనీరింగ్ రంగంవైపు వెళ్లే ప్రతి విద్యార్థి ఐఐటి జెఇఇ మెయిన్స్ పరీక్ష రాసుకుంటే సరిపోతుంది కదా... దాని ఆధారంగానే సీట్ల కేటాయింపు జరిపితే సరిపోతుంది కదా అనే భావన వ్యక్తమవుతోంది. అలాగే ఎంబిబిఎస్, బిడిఎస్‌సహా అన్ని రకాల మెడికల్ కోర్సుల్లో నీట్ ర్యాంకు ఆధారంగా సీట్లు భర్తీ చేసుకుంటే సరిపోతుందనే వాదన వినిపిస్తోంది. రాష్ట్రాలు ప్రత్యేకించి ప్రవేశపరీక్షలు నిర్వహించనవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రవేశపరీక్షల తీరుతెన్నులపై ప్రముఖుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.