ఫోకస్

ప్రవాసుల్లో అనిశ్చితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికాలోని విదేశీయులను వెనక్కి పంపేస్తామని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆయన హోదాకు తగదు. ఈ ప్రకటనతో అమెరికాలోని ప్రవాస భారతీయుల్లో అనిశ్చితి నెలకొంది. అమెరికా ప్రవాసీలను అభద్రతా భావానికి గురి చేశారు. ఇప్పటివరకు అమెరికా అధ్యక్షులుగా ఉన్న బిల్ క్లింటన్, బరాక్ ఒబామా భారత్‌ను గౌరవిస్తూ అన్ని విధాలుగా సహకరించారు. నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వారిలాగే భారత్‌కు అన్ని విధాలా సహకరిస్తారని ఆశిస్తున్నాం. కానీ ఇటీవల ట్రంప్ అమెరికా వలసవాదులను నియంత్రిస్తామని, ప్రవాస అమెరికన్లను వెనక్కి పంపుతామని చేసిన ప్రకటన ప్రపంచ దేశాలన్నింటికీ అభద్రతా భావానికి గురి చేసింది. కాబట్టి ట్రంప్ భారత్‌పై ఎలాంటి వైఖరి చూపుతారో ఇప్పుడే చెప్పలేం. అమెరికాలో ప్రవాస భారతీయుల పట్ల ట్రంప్ ఎలాంటి వైఖరి అవలంభించినా.. అమెరికాలో ఐటి రంగంలో ఎక్కువ శాతం భారతీయులే ఉన్న సంగతి మరువకూడదు. అమెరికాలోని పలు పరిశ్రమల్లో కీలక పోస్టుల్లో ఉన్నవారంతా భారతీయులే, వీరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా నష్టపోయేది అమెరికానే. ఈ విషయాన్ని అమెరికా గుర్తిస్తుందనుకుంటున్నాం. ట్రంప్ అమెరికాలో ప్రవాసం అనే పదాన్ని మానుకోవాలి. భవిష్యత్‌లో భారత్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. భారత్ ప్రపంచ దేశాల్లో ఖ్యాతి గడిస్తోంది. అన్ని రంగాల్లో ఎదుగుతోన్న భారత్‌కు అమెరికా అనుకూలంగానే ఉంటుందని భావిస్తున్నాం.

- పాండురంగా రావు లోక్‌సత్తా తెలంగాణ అధ్యక్షుడు