ఫోకస్

మన యువత అమెరికాకు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షత బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా భారత్-అమెరికా సంబంధాలు యథాతథంగా కొనసాగతాయి. మేధోశక్తికి భారత్ కేంద్రంగా కొనసాగుతోంది. వివిధ రంగాల్లో ఆరితేరిన భారతీయ మేధావుల అవసరం అమెరికాకు ఎంతో ఉంది. ఈ మేధావులకు వ్యతిరేకంగా ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేరు. భారత్-అమెరికా సంబంధాలు ఈనాటివి కావు. దశాబ్దాల తరబడినుండి కొనసాగుతున్నాయి. అమెరికాలోని యూనివర్సిటీలు దాదాపు రెండు శతాబ్దాల నుండి అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతులతో కొనసాగుతున్నాయి. భారత్‌కు చెందిన వందలాది, వేలాది మంది విద్యార్థులు భారత్‌లో గ్రాడ్యుయేషన్ వరకు పూర్తి చేసుకుని పోస్ట్‌గ్రాడ్యుయేషన్, ఆ తర్వాత ఉన్నత చదువులకోసం అమెరికాలోని యూనివర్సిటీల్లో చేరుతున్నారు. అమెరికా యూనివర్సిటీలు ‘్ఫంటేన్ ఆఫ్ నాలెడ్జ్’ కేంద్రాలుగా పేరుతెచ్చుకున్నాయి. విద్య, పరిశోధనలకు ఇవి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. అందుకే అంతర్జాతీయంగా పేరున్న నోబెల్ అవార్డులు అమెరికాలోని శాస్తవ్రేత్తలకు ఎక్కువగా వస్తుంటాయి. భారతీయ విద్యార్థులు కూడా అమెరికా యూనివర్సిటీల్లో అత్యంత ప్రతిభ కనబరుస్తున్నారు. వైద్యం, ఇంజనీరింగ్, ఆర్ట్స్, సైన్స్, కామర్స్, అకౌంటెన్సీ, రక్షణ, అంతరిక్ష విభాగాల్లో భారతీయ మేధావులు పనిచేస్తూ, తమ విజ్ఞానాన్ని అమెరికా అభివృద్ధికోసం ఉపయోగిస్తున్నారు. అమెరికా యూనివర్సిటీల్లో చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాలు పొందినవారు తమ సంపాదనలో కొంతభాగం ఆయా యూనివర్సిటీల సంక్షేమం, అభివృద్ధికోసం విరాళంగా ఇస్తుంటారు. ఈ నిధులను పరిశోధనలకే ఆయా యూనివర్సిటీలు వినియోగిస్తుంటాయి. ఇదొక చక్రంలా కొనసాగుతోంది.
అమెరికాలో ఎగువసభ (సెనేట్), దిగువ సభ (హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు బహిరంగంగా ఎన్ని వాగ్దానాలు చేసినా, ఎన్ని హామీలు ఇచ్చినా, విధాన నిర్ణయాలకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేసినా, సెనేట్ ఆమోదముద్ర ఉంటేనే అవి అమల్లోకి వస్తాయి. సెనేట్‌ను కాదని అమెరికా అధ్యక్షుడు ఒక్కరే ఏమీ చేయలేరు. అమెరికా అధ్యక్షుడిపై సెనేట్ ‘చెక్ అండ్ బ్యాలెనె్సస్’ చేస్తుంది. అమెరికా అధ్యక్షస్థానంలో ఇప్పటివరకు పనిచేసిన వారిలో పేరు, ప్రఖ్యాతులు సంపాదించినవారు అనేకమంది ఉన్నారు. ఐషన్‌హోవర్ (1953-61), జాన్ ఎఫ్ కెనె్నడీ (1961-63), బిల్ క్లింటన్ (1993-2001) తదితరులకు అంతర్జాతీయంగా మంచిపేరు వచ్చింది. వ్యక్తిత్వాన్ని బట్టి వారికి పేరు, ప్రఖ్యాతులు వస్తున్నాయి. భారత్‌లో వ్యక్తులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎన్‌టి రామారావు, జయలలిత తదితరులను చూడండి. వీరికి ప్రజల్లో ‘హీరో’ ఇమేజ్ ఉంది. వ్యక్తిగా భారత్‌లో నాయకులు ఎలాంటి పరిపాలనాపరమైన విధానాలైనా ప్రకటించి, చట్టసభల్లో ఆమోదం తీసుకోగలుగుతారు. నాయకుడిని కాదని చట్టసభల్లో సభ్యులు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. అమెరికాలో అలా కాదు. సెనేట్ నిర్ణయమే తుది నిర్ణయం అవుతుంది. దేశద్రోహం, అమెరికా పరువు తీయడం లాంటి చర్యలకు అధ్యక్షుడు పాల్పపడితే, వారిని పదవినుండి తొలగించే అధికారం సెనేట్‌కు ఉంటుంది.
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికై రెండు నెలలు గడిచిపోయింది. ఆయనకు ప్రిపరేటరీ టైం కొనసాగుతోంది. భారత్‌లో మంత్రివర్గ సభ్యులను ఎంపిక చేసుకున్నట్టు, అమెరికా అధ్యక్షుడు తనకు సహకారంగా ఉండేందుకు కార్యదర్శులను ఎంపిక చేసుకుంటారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని ఆయా రంగాల్లో కార్యదర్శులుగా నియమించుకుంటారు. నాలుగైదు నెలలుగడిస్తే వాస్తవాలు ఏమిటో ట్రంప్‌కు తెలిసివస్తుంది. అమెరికా అభివృద్ధి, సంక్షేమానికి భంగం కలిగించే నిర్ణయాలు ఏవి తీసుకున్నా సెనేట్ ఆమోదం లభించకపోవచ్చు. మేధస్సు, క్రమశిక్షణ కలిగిన భారతీయ విద్యార్థులు, మేధావులను నిర్లక్ష్యం చేయలేరు.

- ప్రొఫెసర్ కె. పురుషోత్తంరెడ్డి సామాజిక శాస్తవ్రేత్త