ఫోకస్

ఆంక్షలు పెడితే వారికే నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ చాకచక్యంగా సరైన కార్డు వాడి అధికారంలోకి వచ్చారు. తాను అధికారం చేపడితే తొలుత దేశంలోని ప్రజల బాగోగులు పట్టించుకుంటానని, నిరుద్యోగం లేకుండా చేస్తానని పలు వాగ్దానాలు చేసి ప్రజలను ఆకర్షించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చినట్లే ట్రంప్ కూడా సెంటిమెంట్‌నే చక్కగా ఉపయోగించుకున్నారు. మన నీళ్ళు, మన ఉద్యోగాలను ఇలా అన్ని రంగాల్లోనూ తెలంగాణ ప్రజలు దోపిడికి గురవుతున్నారని ఆరోపించినట్లే, ట్రంప్ కూడా వివిధ దేశాల నుంచి విద్యార్థులు, ఉద్యోగులు రావడం వల్ల అమెరికా నష్టపోతున్నదన్న ప్రచారాన్ని చేశారు. ఇప్పటివరకు అమెరికాను పాలించిన అధ్యక్షులు ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశారే తప్ప దేశ ప్రజల బాగోగులను పట్టించుకోలేదని, తనను ఎన్నుకుంటే ప్రపంచాన్ని పక్కనపెట్టి దేశ ప్రజల గురించే ఆలోచన చేస్తానని, నిరుద్యోగం లేకుండా చేస్తానని, ఇలా ఎనె్నన్నో హామీలు గుప్పించారు. అలా వ్యూహాత్మకంగా ట్రంప్ ఉపయోగించిన కార్డు ఫలితాన్ని ఇచ్చింది. అయితే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేసేందుకు ట్రంప్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అది ఎంత శాతం చేపడతారు. వంద శాతం చేపడతారా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే ట్రంప్ ఇంకా అధికారాన్ని చేపట్టలేదు. దీంతో అమెరికాలో నివసిస్తున్న మన భారతీయుల్లో, ఇతర దేశాలకు చెందిన ప్రజల్లో భయాందోళన ప్రారంభమైంది. ఇది సహజమే. కానీ అంత వేగంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటారని అనుకోవడం లేదు. ఎందుకంటే మన దేశానికి చెందిన డాక్టర్లు, ఐటి ప్రొఫెషనల్స్, ఆర్కిటెక్చర్లు ఇంకా వివిధ రంగాలకు సంబంధించిన నిపుణులు అమెరికాకు పెద్ద దిక్కుగా ఉన్నారు. మన నిపుణులైనవారు అనేక రంగాల్లో సేవలందిస్తున్నందున అమెరికా దేశ ప్రజలు అదృష్టవంతులని చెప్పవచ్చు. ట్రంప్ తొందరపడి నిర్ణయం తీసుకుంటే అమెరికా ఆర్థికంగానే కాకుండా ఇంకా అనేక రంగాల్లో దెబ్బతింటుందని నా అభిప్రాయం.

- మహ్మద్ షబ్బీర్ అలీ, ప్రతిపక్ష నేత, తెలంగాణ శాసన మండలి