ఫోకస్

ఇబ్బందులు తప్పవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ట్రంప్ పాలనలో భారతీయులకు, ఎన్‌ఆర్‌ఐలకు ఇబ్బందులు వచ్చేలానే ఉన్నాయి. ట్రంప్ తన ఎన్నికల ప్రసంగాల్లో స్థానికులకు ఉద్యోగాలు రావడం లేదు, బయటి దేశాలవారే ఉద్యోగాలు తన్నుకు పోతున్నారని పెద్దఎత్తున ప్రచారం చేశారు. అలాగే అమెరికా భద్రతకు సంబంధిచించిన అంశాలు కూడా ప్రస్తావించారు. బయటి దేశాల నుండి వచ్చినవారు ఉద్యోగాలు చేస్తూనే దేశ భద్రతకు ముప్పుకలిగించేలా తీవ్రవాద కార్యకలాపాల్లో నిమగ్నమవుతున్నారని వ్యాఖ్యానించారు. ఒబామా అధ్యక్షుడు అయిన తర్వాత వ్యాపారాలు చేసేందుకు, ఇతరత్రా అక్రమ పద్ధతుల్లో నివసిస్తున్న వారిని వెనక్కు పంపించకుండా వారి స్థిరనివాసానికి వీలుగా క్రమబద్ధీకరణ చేశారు. మెక్సికో నుండి దొంగతనంగా కొంతమంది అమెరికాలో ప్రవేశిస్తున్నారు. అలాంటి వారంతా ఎన్ని సంవత్సరాల నుండి అమెరికాలో ఉన్నారో, ఎంత సంపాదించారో లెక్కలు చూపించి తదనుగుణంగా పన్ను చెల్లిస్తే వారిని సక్రమ వలసదారులుగా పరిగణించేందుకు వీలుకల్పించే చట్టాన్ని ఒబామా తీసుకువచ్చారు. ఆ బిల్లు వల్ల దాదాపు 10 లక్షల మంది లీగల్ ఇమిగ్రెంట్స్ కింద మారిపోయారు. వారిలో ఒక మతానికి చెందిన ఎక్కువమంది అమెరికాలో తీవ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్నట్టు తేలిందని ట్రంప్ ఆరోపించారు. ఒబామా చేసిన కార్యక్రమాలను అదే ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా ఉన్న హిల్లరీ క్లింటన్ కొనసాగించే అవకాశం ఉందని భావించిన అమెరికా పౌరులు ట్రంప్ వైపు మొగ్గు చూపారనేది స్థానిక మీడియా విశే్లషణ. ఇన్యూరెన్స్ కట్టడానికి డబ్బులు లేకున్నా వైద్య సహాయం అందించేందుకు వీలుకల్పించే ఒబామా కేర్ పథకం 10 ట్రిలియన్ డాలర్ల వ్యయం కాస్తా 20 ట్రిలియన్ల వ్యయానికి పెరిగింది. దీనికితోడు అమెరికాలో ఉన్న ఉద్యోగాలు అన్నీ అవుట్ సోర్సింగ్ కింద విదేశీయులకే దక్కుతున్నాయి. మరోపక్క చైనా వస్తువుల వెల్లువకూడా అమెరికాలో పెరిగింది. వస్తువుల ఉత్పత్తి చైనాలో జరగడంతో అమెరికాలో సాంకేతిక నైపుణ్యాలతో కూడిన సేవల రంగం అభివృద్ధి జరగడం లేదనేది ట్రంప్ యోచనగా ఉంది. అలాగే పెద్దకార్లు తమ స్పేర్‌లను ఇతర దేశాల్లో తయారుచేయించి అమెరికాలో వాటిని అమ్ముకుంటున్నారు. ఇక మీదట స్పేర్‌లను అమెరికాలో తయారుచేయకపోతే పన్ను పెంచుతామని కూడా ట్రంప్ హెచ్చరించారు. అలాగే మెక్సికో సరిహద్దులో కంచె లేదా గోడ నిర్మిస్తామని కూడా ట్రంప్ చెప్పడం అమెరికా ప్రజలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. అలాగే అమెరికాలో ప్రవేశించేవారిపై సెక్యూరిటీ స్క్రూటినీ పెంచుతామని కూడా ట్రంప్ చెప్పడం కూడా అమెరికన్లను ఆకట్టుకుంది. హెచ్-1బి వీసా మీద వెళ్లినవారు సగటున అమెరికాలో 60వేల డాలర్లకే పనిచేస్తుండగా, అమెరికా పౌరులు 80 నుండి లక్ష డాలర్లకు పనిచేస్తున్నారు. తక్కువ వేతనానికే భారతీయులు లభ్యం కావడమేగాక, ఎక్కువ సమయం రెట్టింపు నైపుణ్యంతో పనిచేసే సామర్థ్యం భారతీయులకే ఉంది. బాధ్యత విషయంలోనూ భారతీయులు మరింత అప్రమత్తంగా ఉండటంవల్ల కంపెనీలు భారతీయులవైపు చూస్తున్నాయి. ఇలాంటి సమయంలో అవుట్ సోర్సింగ్‌పై పనిచేసే భారతీయుల వేతనాలను పెంచాలనే నిబంధనలు ట్రంప్ అమలుచేస్తే అంత ఎక్కువ వేతనం ఇవ్వలేక పరోక్షంగా అమెరికన్లనే 80 వేల డాలర్లకు ఉద్యోగాల్లో పెట్టుకోవడం ద్వారా నిరుద్యోగ సమస్యను నివారించవచ్చనేది ట్రంప్ ఆలోచనగా కనిపిస్తోంది. కంపెనీలో భారతీయులు పనిచేసే అంత శ్రద్ధగా అమెరికన్లు పనిచేయలేరు, దానివల్ల ప్రోడక్ట్ క్లాలిటీకూడా దిగజారిపోయే ముప్పు ఉంది. కాని అలా చేసిన తర్వాత చాలా కంపెనీలు ఆర్థికభారంతో కుప్పకూలే ముప్పు కూడా లేకపోలేదు. ఇలాంటి అంశాలు అన్నీ పరిశీలించాల్సి ఉంటుంది. మాస్టర్స్ డిగ్రీ చేసేవారికి ఇచ్చే ఉద్యోగ వీసాలు కూడా తగ్గే ప్రమాదం ఉంది. యూనివర్శిటీల ఫీజులు ఆకాశాన్నంటడంతో అక్కడ చదివే విద్యార్థుల సంఖ్య తగ్గి విదేశీ విద్యార్థుల ఫీజులపై బతికే యూనివర్శిటీలు మూతపడే ముప్పులేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా తిరిగి పాత విధానంలోకి రావల్సి ఉంటుంది. రానున్న మార్పులు గమనిస్తున్న భారతీయులకు భయాందోళనలు కలిగిస్తున్నాయి, కాని అమెరికన్లు మాత్రం ట్రంప్ నిర్ణయాలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ అధికారంలోకి రావడానికి కారణమైన విషయాలను అమలుచేసేందుకు ఎలాంటి బిల్లులు తీసుకువస్తారనే దానిపై అమెరికా భవితవ్యం ఆధారపడి ఉంటుంది.

- గుగ్గిలపు కిశోర్ కుమార్ ఐటి నిపుణుడు, వర్జీనియా