ఫోకస్

ప్రైవేటు రంగాలోనూ ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశ స్వభావమే కుల ప్రభావంతో కొనసాగుతోంది. ఈ దేశంలో రిజర్వేషన్లు అవసరమే. ప్రభుత్వ ఉద్యోగాల్లోనే కాకుండా, ప్రైవేట్‌రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉంది. మతపరమైన రిజర్వేషన్లు కావాలని ఎవరూ అనడం లేదు. లౌకికరాజ్యం కనుక మతపరమైన రిజర్వేషన్లకు అవకాశం లేదు. హిందువుల్లో వృత్తులు ఉన్నట్టే, ముస్లింలలో కూడా చాకలి, మంగలి, వడ్రంగి తదితర కులాలున్నాయి. ముస్లింలలో చాలామంది వృత్తులపైనే జీవిస్తున్నారు. సామాజికంగా, ఆర్థికంగా ఈ వృత్తుల వారు పేదరికంలో మగ్గుతున్నారు. హిందువుల్లో కులాలపరంగా రిజర్వేషన్లు కల్పించినట్టే, ముస్లింలు, ఇతర మైనారిటీల్లోని పేదవృత్తుల వారికి రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా మతపరమైన రిజర్వేషన్లు ఇస్తామనడం లేదు. కేవలం ముస్లింలలో అణగారిన వర్గాలకు, అణగారిన వృత్తుల వారికే రిజర్వేషన్లు కల్పిస్తామంటున్నారు. అందులో ఎలాంటి తప్పులేదు. సమాజంలో ఏ మతంలో ఉన్న పేదలకైనా రిజర్వేషన్లు కల్పించడం వల్ల వారి బతుకులు బాగుపడతాయన్నదే ముఖ్య ఉద్దేశం.
ఇటీవల వచ్చిన వార్తలను చూడండి.. దేశంలో కేవలం ఒక శాతం వర్గం వద్ద 58 శాతం సంపద ఉంది. అంటే 99 శాతం ప్రజలందరి వద్ద ఉన్న సంపద 42 శాతం అనేకదా! ఇది ఏం సూచిస్తోంది. దేశ సంపద కేవలం ఏ కొందరివద్దనో కేంద్రీకృతమై ఉందనే కదా! ప్రభుత్వ నిధులు పేదలకు చేరడం లేదని స్పష్టం అవుతోంది. ఆర్థికంగా బాగాబలంగా ఉన్నవారు, అధికారంలో కొనసాగుతూ, పేదలకు ఏదో భిక్ష వేస్తున్నట్టు అనిపిస్తోంది. పేదల చేతికి రాజ్యాధికారం రావాల్సి ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 67 ఏళ్లు పూర్తయి, 68వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. అంబేద్కర్ ఏం చెప్పారు. రిజర్వేషన్ల అంశంపై పదేళ్ల తర్వాత రివ్యూ చేయాలన్నారు. అంటే పదేళ్లలో దేశంలో పూర్తిగా సమానత్వం రావాలన్నదే ఆయన ఉద్దేశం.
70 ఏళ్లయినా సమానత్వం రాలేదు. అస్పృశ్యత కొనసాగుతూనే ఉంది. పేదల సంఖ్య పెరిగిందే తప్ప తగ్గలేదు. పేదరిక నిర్మూలనా కార్యక్రమాలు, సమర్థవంతంగా అమలు కావడం లేదని స్పష్టమవుతోంది. ఎస్‌సి, ఎస్‌టి, బిసిలు విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్లను అనుభవిస్తున్నప్పటికీ ఉద్యోగాల్లో వీరి సంఖ్య గణనీయంగా పెరగలేదు. ఎస్‌సిలలో చూడండి.. మాదిగలు, మాదిగ ఉపకులాలకు చెందిన ప్రజల పరిస్థితి నేటికీ దారుణంగానే ఉంది. రిజర్వేషన్ల ఫలితాలు సమానంగా అందరికీ చేరకుండా, కొన్ని వర్గాలకు మాత్రమే లబ్ధి చేకూరుతోంది. అందుకే ఎస్‌సిల వర్గీకరణ జరగాలి. ఎస్‌సిల వర్గీకరణ ఎందుకు జరగడంలేదనేది ఆలోచించాల్సిన విషయం. ఆర్థికంగా బలంగా ఉన్న కొన్ని కులాలవారు బిసిల జాబితాలో తమ కులాన్ని చేర్చాలంటూ ఆందోళన చేస్తున్నారు. ఇది సరైన డిమాండ్ కాదు.

- చెరుపల్లి సీతారాములు సిపిఎం నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ