ఫోకస్

అభివృద్ధికి ఇదొక మెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణలో ఉన్న జనాభాలో ఉన్న 30 శాతం ముస్లింల అభివృద్ధికోసం ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రస్తుతం ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లను ఏకంగా 12 శాతానికి పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నాం. వాస్తవానికి ముస్లింల అభివృద్ధి జరుగకుండా సమగ్ర తెలంగాణ అభివృద్ధి అసాధ్యం. ఒక్క రిజర్వేషనే్ల ముస్లింల సమగ్ర అభివృద్ధికి తోడ్పడుతాయని చెప్పలేను కానీ అభివృద్ధి వైపు ఇది ఒక మెట్టుగా భావించవచ్చు. అయితే ముస్లింలకు ఏ చిన్నపాటి లబ్ధిచేకూరిన కొన్ని మతోన్మాద శక్తులు గగ్గోలు పెడుతూనే ఉంటాయి. దేశంలోను, ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో అనేక వెనుకబడిన కులాలు రిజర్వేషన్లు పొందుతుండగా, ముస్లింలకు రిజర్వేషన్లు ప్రకటించగానే ఇతర వర్గాలకు అన్యాయం జరిగిపోతున్నట్లు బిసి నేతలు సైతం ఆందోళన చెందుతున్నారు. ఇతర కులాల విషయంలో ఎందుకు నోరుమెదపరో అర్థం కావటం లేదు. వాస్తవానికి రాష్ట్ర హైకోర్టు ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తున్నప్పటకీ పట్టువదలని విక్రమార్కుడిలా దివంగత సిఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జీవోల స్థానంలో ఆర్డినెన్సు తీసుకువచ్చి చట్టసభలో బిల్లు పాస్ చేయించి నాలుగు శాతం రిజర్వేషన్లను అమలు పర్చారు. అసలు ముస్లింలకు రిజర్వేషన్లు ఏనాటి నుండో ఉన్నాయి. వివిధ సంస్థానాలు, రాజ్యాల్లో కూడా రిజర్వేషన్లు కొనసాగాయి. హైదరాబాద్ నిజాం పాలనలో 112 కులాలకు రిజర్వేషన్లు ఉండేవి. అన్ని రంగాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశం నాటి రాచరిక పాలనలోనూ ఉండేది. జస్టిస్ రాజేంద్ర సచార్ కమిటీ దేశంలోని ముస్లింల దయనీయ పరిస్థితిని సమగ్ర ఆధారాలతో నివేదికను ఏనాడో సమర్పించింది. రంగనాథ మిశ్రా కమిషన్ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించటం ద్వారానే వారి అభివృద్ధికి బాటలు వేసినట్లు అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో జస్టిస్ దాళ్వా సుబ్రమణ్యం కమిషన్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎన్ని కమిటీలు, కమిషన్లు వేసినప్పటికీ వెనుకబడిన ముస్లిం వర్గాల్లో రోజురోజుకూ దయనీయ పరిస్థితి పెరుగుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్రాలు ఆలస్యం చేయకుండా ముస్లింలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- హాబీబుర్ రెహ్మన్, రాష్ట్ర అధ్యక్షుడు, ముస్లిం యునైటెడ్ ఫ్రంట్, విజయవాడ.