ఫోకస్

రాజ్యాంగ విరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించబోతున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం. ఈ దేశంలో రిజర్వేషన్లు ఏ వర్గాలకు ఉండాలో రాజ్యాంగంలోనే అంబేద్కర్ ఖరారు చేశారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటుతనంతో ఉన్న వర్గాలకు విద్యా, ఉద్యోగాలలోపాటు చట్టసభలకు కూడా రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఒబిసిలకు జాతీయస్థాయిలో, రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. రాష్టస్థ్రాయిలో బిసి, ఇబిసిలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాలు కాకుండా ఇతర సామాజిక వర్గాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఎకనామికల్ బ్యాక్ వర్డ్ క్లాస్ (ఇబిసి) రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. ఇబిసి కేటగిరిలో ఆర్థికంగా వెనుకబడిన వారు వ్యక్తిగతంగా అర్హులు. దీనికి ఆర్థికంగా వెనుకబడినవారు ఎవరైనా అర్హులే. ఈ కేటగిరిలో మైనార్టీలు కూడా లబ్ధిపొందే అవకాశం ఉండగా తిరిగి మైనార్టీ రిజర్వేషన్లంటూ కొత్తగా మరొక వర్గాన్ని సృష్టించడం సహేతుకం కాదు. అదికూడా మతపరమైన రిజర్వేషన్లు విధించడం వాంఛనీయం కాదు. ఈ చర్య మత విద్వేషాలను రెచ్చగొట్టినట్టు అవుతుంది. లౌకిక దేశంలో మతపరమైన రిజర్వేషన్లు పెట్టడం రాజ్యాంగ విరుద్ధం. ఇలాంటి రిజర్వేషన్లను న్యాయస్థానాలు తప్పుబట్టి కొట్టివేశాయి కూడా. అయినప్పటికీ మళ్లీ అదే రకమైన రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించటం కేవలం ఓట్ల రాజకీయమే. మతపరమైన రిజర్వేషన్లు చెల్లుబాటు కావని తెలిసి కూడా తిరిగి మైనార్టీలకు రిజర్వేషన్లు ఇస్తామనడం ఆ వర్గాలను మోసం చేయడమే తప్ప మరొటి కాదు. ఎస్సీ, ఎస్టీ, బిసి రిజర్వేషన్లు రాష్టస్థ్రాయిలో 50 శాతానికి మించకూడదన్న నిబంధన ఉంది. అలాంటప్పుడు ప్రస్తుతం ఉన్న 50 శాతంలోనే మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించడం ఎలా సాధ్యవౌతుంది. ప్రస్తుతం రిజర్వేషన్లలో కోత పెడితే తప్ప కొత్తగా మరెవ్వరికీ అవకాశం కల్పించడం సాధ్యపడదు. ప్రస్తుతం పొందుతున్న రిజర్వేషన్లలో కోత పెట్టడం వల్ల కొత్త సమస్యలను సృష్టించడం తప్ప మరొటి కాదు.

- డాక్టర్ రాజ్ సిద్థార్థ సామాజిక విశే్లషకులు రిటైర్డు ప్రొఫెసర్, కాకతీయ వైద్య విశ్వవిద్యాలయం