ఫోకస్

మైనార్టీలకు రిజర్వేషన్లు అవసరమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కల్పిస్తున్న రిజర్వేషన్లను రాజకీయ కోణంలో చూడరాదు. సమాజంలో మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మైనార్టీ వర్గాల్లో ముస్లింలు, సిక్కులు, జైనులు ఇలా అనేక మతాలకు చెందిన వారు నేటికీ వెనుకబడి ఉన్నమాట వాస్తవమే. వారు ఇతరులతో పోటీపడే స్థాయికి ఎదిగే విధంగా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలి. అందుకు రిజర్వేషన్లు దోహదపడగలవు. అయితే దీనిని రాజకీయ కోణంలో చూడటం సరికాదు. మైనార్టీలను ప్రోత్సహించడంతోపాటు మైనార్టీ రిజర్వేషన్లకు పరిమితి విధించాలి. దాంతోపాటు ఈ రిజర్వేషన్లు దుర్వినియోగం గాకుండా ప్రభుత్వం తగుజాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణమైన వ్యక్తులతో వికలాంగులు పోటీపడేందుకు వారికి రిజర్వేషన్లు కల్పించాము. అదే పద్దతిలో మైనార్టీలను కూడా ప్రోత్సహించాలి. లేనిచో వారు సమాజంలో మిగిలిన వర్గాల వారితో పోటీ పడలేరు. ఇతరులతో పోటీపడాలంటే ఆ స్థాయి వరకు ఎదిగేందుకు ప్రోత్సహించాలి. సమానస్థాయికి చేరుకున్నప్పుడు క్రీమిలేయర్ ఎలానూ ఉంది.

- బొత్స సత్యనారాయణ వైకాపా సీనియర్ నాయకుడు