ఫోకస్

మానవీయ కోణంలో చూడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్యాంగం ప్రకారం దేశంలో ఏ మతమైనా, కులానికి చెందిన వారైనా ఆర్థికంగా వెనుకబడి ఉన్నట్లయితే వారి అభ్యున్నతికి రిజర్వేషన్లు కల్పించాలి. ముస్లింలు బాగా వెనుకబడి ఉన్నారు. కాబట్టే 1950 నుంచే రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారు. జనాభా లెక్కల ప్రకారం 70 నుంచి 80 శాతం ముస్లింలు విద్యాపరంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. దేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత సుమారు 40 ఏళ్ళ అనంతరం కేంద్ర ప్రభుత్వం ముస్లింల స్థితిగతులు తెలుసుకునేందుకు సచార్ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వంలో, ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రైవేటు రంగాల్లో ముస్లింలు వెనుకబడి ఉన్నారని, ముఖ్యంగా ఆర్థికంగా, విద్యాపరంగా కూడా వెనుకబడి ఉన్నారని సచార్ కమిటీ పేర్కొంది. ఈ మేరకు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు. ముస్లింలు వెనుకబాటు (్ఫస్‌మాంద)తనంతో ఉన్నందున వారికి అన్ని రంగాల్లోనూ రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని రంగనాథ మిశ్రా కమిషన్ కూడా సిఫార్సు చేసింది. దురదృష్టవశాత్తు రిజర్వేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ సిఫార్సులు నేటికీ అమలులోకి రాలేదు. కాగా వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారు. విద్యారంగంలో, ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు కల్పించారు. దీనిని వ్యతిరేకిస్తూ కొన్ని శక్తులు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. మరోవైపు సార్వత్రిక ఎన్నికలకు ముందు టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు తాము అధికారంలోకి వస్తే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సుమారు రెండున్నర సంవత్సరాల తర్వాత కొంత కదలిక వచ్చింది. సుధీర్ కమిషన్‌ను నియమించింది. కమిషన్ నివేదిక అందజేసినా ఫలితం కనిపించలేదు. ముస్లింలను సంతృప్తి పరిచేందుకు కమిషన్లు ఏర్పాటు అవుతున్నాయే తప్ప వారి జీవన విధానాల్లో మార్పు రావడం లేదు. ముస్లింల వెనుకబాటుతనం గురించి సచార్, రంగనాథ మిశ్రా కమిషన్లు ఇదివరకే స్పష్టంగా నివేదికలు అందజేసినందున ఇక జాప్యం చేయకుండా ఆ సిఫార్సులను అమలు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ఎస్‌సి, ఎస్‌టి, బిసిలతో సమానంగా రిజర్వేషన్లు కల్పించి ఆదుకోవాలి. అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానవీయ కోణంలో ఆలోచన చేసి ఆదుకోవాలని కోరుతున్నాను. ముస్లింలకు దేశభక్తి అధికంగా ఉన్నది. వారు కూడా దేశంకోసం పాటుపడుతున్నవారే అన్న విషయాన్ని ఇక్కడ గమనించాలి.

- అల్‌హజ్ సయ్యద్ షా హమీద్ హుస్సేన్ శుత్తారీ అధికార ప్రతినిధి, అఖిల భారత సున్నీ ఉలెమా బోర్డు