ఫోకస్

ఎన్నికల హామీ నిలబెట్టుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముస్లింలలో వెనుకబడిన వారికి 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని టిఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళికలో స్పష్టమైన హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత ఈ హామీని నెరవేర్చేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటోంది. మతపరమైన రిజర్వేషన్లు కావు. ముస్లింలలో వెనకబడినవారికి రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారని గుర్తించాలి. తమిళనాడులో రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేస్తున్నారో అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో 12శాతం రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అసెంబ్లీలో ఆమోదం తరువాత అమలుకోసం ప్రధానమంత్రిని కలుస్తారు. కేంద్రం ఆమోదించకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లయినా రిజర్వేషన్లు అమలు చేయాలనే స్పష్టమైన వైఖరితో ప్రభుత్వం ఉంది. దేశంలో ముస్లిం మైనారిటీల ఆర్థిక స్థితిగతులు దయనీయంగా ఉన్నాయి. సచార్ కమిటీ నివేదిక దీనిని స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి వర్గం సమానంగా అభివృద్ధి చెందాలి అనేది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆశయం. దానికి తగ్గట్టుగానే అన్ని వర్గాల అభివృద్ధికి ప్రయత్నిస్తున్నారు. అన్ని వర్గాలు అభివృద్ధి చెందడమే బంగారు తెలంగాణ లక్ష్యం. ఏ ఒక్క వర్గం వెనకబడి ఉన్నా అది మంచిది కాదు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ధృడవైఖరితో ఉన్నారు. అప్పటి యుపిఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడే 2004లో ముస్లింల స్థితిగతులపై కెసిఆర్ మాట్లాడారు. ఆ తరువాత సచార్ కమిటీ వేసి, ముస్లింల స్థితిగతులను అధ్యయనం చేశారు. సచార్ కమిటీ ముస్లింల పరిస్థితిపై చక్కని అధ్యయనం చేసి, అనేక సిఫారసులు చేసింది. వాటిని అమలు చేసి ఉంటే ఇప్పటికే ముస్లింల పరిస్థితి కొంత మెరగయ్యేది. కానీ అమలు చేయలేదు. మతపరమైన రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం వాస్తవమే. అయితే ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ఇవి మతపరమైన రిజర్వేషన్లు కావు. ముస్లింలోని పేదవారికి రిజర్వేషన్లు అని చెప్పారు. గిరిజనులకు సైతం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండాలనేది టిఆర్‌ఎస్ నినాదం. ఎన్నికల ప్రణాళికలో ఈ అంశాన్ని కూడా స్పష్టంగా పేర్కొంది. న్యాయపరంగానూ రిజర్వేషన్లు నిలిచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 12 శాతం రిజర్వేషన్లు అమలు అవుతాయనే నమ్మకం ఉంది.

- పల్లా రాజేశ్వర్‌రెడ్డి శాసన మండలిలో చీఫ్‌విప్ టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ