ఫోకస్

మత రిజర్వేషన్లు సరేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రిజర్వేషన్లు అనేవి ప్రజల్లో కొన్ని వర్గాల వారికి ప్రభుత్వం కల్పించే మినహాయింపులు కేటాయింపుల కిందకు వస్తాయి. ఎన్నికలు, విద్య, ఉపాధి అవకాశాల్లో కులపరంగా, లింగపరంగా ప్రాంతాలపరంగా, శారీరక మానసిక లోపాలు, సైన్యంలో పనిచేసిన వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ రక్షణ కల్పించారు. చారిత్రకంగా, బలహీనపడిన వర్గాలవారికి రిజర్వేషన్లు కల్పించడం ద్వారా వారి ఉన్నతికి, అభివృద్ధికి దోహదపడాలనేది ప్రభుత్వ ఆశయం. మరో విధంగా చెప్పాలంటే సమాజంలో అసమానతలను తొలగించాలనేది భావన. 50 శాతం కోటా మించి రిజర్వేషన్లు అమలుచేయాలంటే మండల్ కమిషన్ తీర్పు సమయంలో సర్వోన్నత న్యాయస్థానం పొందుపరిచిన నిర్ణీత ప్రమాణాలను వెనుకబడిన తరగతుల కమిషన్ పరిగణనలోకి తీసుకోవాలని, గణాంకాల ఆధారంగా పున:సమీక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం తమిళనాడులో 69 శాతం, కర్నాటకలో 73 శాతం మేర రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. ఇదంతా బిసిలు, ఎస్సీలు, ఎస్టీల రిజర్వేషన్లకు సంబంధించినవే. తరతరాలుగా భారత సమాజంలో అణచివేతకు గురైన ఈ వర్గాలకు గౌరవం, సమాన అవకాశాలు లభించడం లేదని భావించి వారిని జాతీయ నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసేందుకు రిజర్వేషన్లు కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా మతపరమైన రిజర్వేషన్లు కల్పించడంపై వివాదం చెలరేగింది. ఇందుకు తొలుత బీజం వేసింది తమిళనాడు ప్రభుత్వమే, ముస్లింలకు, క్రైస్తవులకు 3.5 శాతం సీట్లను కేటాయించింది. దీని కారణంగా ఒబిసి రిజర్వేషన్లను 30 శాతం నుండి 23 శాతానికి తగ్గించింది. ముస్లింలు, క్రైస్తవులైన ఇతర వెనుకబడిన కులాలకు చెందిన వ్యక్తులు కూడా దీని పరిధిలోకి వస్తారు కనుక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఉపకోటాను సంబంధిత మత సమూహాలు వెనుకబడి ఉండటాన్ని గుర్తించి రిజర్వేషన్లు కల్పించామని, మతం ఆధారంగా వారికి రిజర్వేషన్లు కల్పించలేదని ప్రభుత్వం వాదిస్తోంది. దేశంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం ఆమోదయోగ్యం కాదన్నది నిస్సందేహం. రిజర్వేషన్ల అసలు లక్ష్యాన్ని విస్మరించి తమ రాజకీయ అవసరాలకు తగిన విధంగా రిజర్వేషన్లు ఉపయోగించుకోవాలని రాజకీయ నాయకులు ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచనలు రాజ్యాంగ నిర్దేశానికి విరుద్ధం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన అంశం ఇప్పటికీ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పరిశీలనలో ఉంది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన ముస్లింలకు మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వదలుచుకున్నామని అప్పటి ప్రభుత్వం పేర్కొంది. అందరికీ కాదని వాదించింది. మతపరమైన రిజర్వేషన్లు మతపరమైన నియోజకవర్గాల ఏర్పాటుకు దారితీస్తాయని, దానివల్ల జాతీయ సమైక్యతకు భంగకరమని మరికొంత మంది వాపోతున్నారు. ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు కల్పించేందుకు 2012లోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సచార్ కమిటీ నివేదిక ఆధారంగా ముస్లింలకోసం అభివృద్ధి పథకాలు ప్రారంభించింది. వాళ్ల రక్షణకు, మతపరమైన హింసను నిరోధించేందుకు కూడా ఒక చట్టం చేయాలని చూసింది. దళితులకు కల్పించే అన్ని రకాల హక్కులను వీరికీ కల్పించాలని ప్రయత్నించింది అది కార్యరూపం దాల్చలేదు. అయితే అదే తరహా ఆలోచనలను ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం చేస్తోంది. ఈ అంశంపైనే కొంతమంది నిపుణుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.