ఫోకస్

ఆంధ్రాను దగా చేసే బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రాకు ప్రత్యేకహోదాలేదు. రైల్వే జోన్ లేదు. ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రం దగా చేసింది. పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా కల్పిస్తామని విభజన బిల్లుకు మద్దతు ఇచ్చిన బిజెపి ఈ రోజు కుప్పిగంతులువేస్తోంది. ప్రత్యేక హోదా అంశంపై స్పష్టమైనప్రకటన వస్తుందని ఈ రోజు ఎదురుచూశాం. కాని నిరాశ కలిగింది. బిజెపి, టిడిపి రెండు పార్టీలు రాష్ట్రప్రజలను వంచించాయి. వౌలిక సదుపాయాలకు పెద్ద పీట అన్నా, మనకు వచ్చే ప్రయోజనం ఎంత ? రైల్వే బడ్జెట్, సార్వత్రిక బడ్జెట్‌ను కలిపేశారు. దీని వల్ల గందరగోళం నెలకొంది. పెద్ద నోట్ల రద్దు వల్ల ఏ మాత్రం ప్రయోజనం వచ్చింది. రద్దయిన నోట్లపై కేంద్రం దాగుడు మూతలు ఆడుతోంది. విశాఖ రైల్వే జోన్‌పై ఇంకా ప్రకటన చేయలేదు. మరోరెండేళ్లలో ఎన్నికలు వస్తున్నాయి. ఈ బడ్జెట్‌కు హృదయం లేదు. స్పందనలు లేవు. సామాన్యుడి కష్టాలను గట్టెక్కించే విధంగా లేదు. మన దేశంలో కేంద్ర బడ్జెట్‌కు ప్రాధాన్యత ఎక్కువ. ఈ బడ్జెట్ ద్వారా దేశాభివృద్ధిని నిర్దేశిస్తారు. బడ్జెట్ సామాన్యులను ఆర్ధిక గడ్డు పరిస్ధితుల నుంచి గట్టెక్కించే విధంగా ఉండాలి. మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించాలి. పరిశ్రమల ఏర్పాటుకు రాయితీ ఇవ్వాలి. ఇరుగుపొరుగు దేశాలతో సఖ్యతగా ఉంటూ రక్షణ రంగ బడ్జెట్‌ను తగ్గించుకోవాలి. కేంద్ర బడ్జెట్‌కు ఉన్న ఆకర్షణ రాష్ట్ర బడ్జెట్‌కు ఉండదు. కాని రాష్ట్ర బడ్జెట్ సంక్షేమరంగం, ఇరిగేషన్ రంగాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు. ఏతావాతా 1991లో తెలుగు బిడ్డ పివి నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ ఆర్ధిక రంగం ముఖ చిత్రం మారింది. ఎలక్ట్రానిక్ మీడియా రంగ ప్రవేశం చేయడం, బడ్జెట్‌లపై చర్చలు, పత్రికలో పుంఖానుపుంఖానులుగా వ్యాసాలు, నిధుల కేటాయింపు, దుర్వినియోగంపై పరిశోధనలు పెరిగాయి. అలాగే ప్రైవేట్ రంగ పెట్టుబడులను స్వాగతించారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏమిటి అనే ఆసక్తి జనంలో పెరిగింది.ప్రచార మాద్యమాల వల్ల ఈ రోజు బడ్జెట్‌కు ఎనలేని ఆసక్తి పెరిగింది. సామాన్యుల సంక్షేమం కోరే బడ్జెట్ ఇస్తేనే దేశంలో శాంతి నెలకొంటుంది. అధికారంలో ఏ పార్టీ ఉన్నా, ఇదే సూత్రం వర్తిస్తుంది.

-విశే్వశ్వరరెడ్డి వైకాపా శాసనసభాపక్ష ఉపనేత, ఏపి