ఫోకస్

అవినీతి అంతానికి ప్రయత్నమే లేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌలిక వసతులు, గ్రామీణ రంగాలపై దృష్టి పెట్టడం, ద్రవ్య నియంత్రణ, సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలకు కార్పోరేట్ పన్ను రాయితీ లేదు. సామాన్య ఉద్యోగులకు ఆదాయపు పన్ను ఊరట కేంద్ర ప్రభుత్వ తాజా బడ్జెట్‌లో ఆహ్వానించదగిందే. విద్య ఆరోగ్యాల్ని పట్టించుకోలేదు. అవినీతి అంతానికి నిజమైన ప్రయత్నం చేయలేదు. బ్యాంకుల మొండి బకాయిలు, కార్పొరేట్ సంస్థల వైఫల్యం, కాకి లెక్కలు, ప్రైవేట్ పెట్టుబడులు క్షీణించడం వంటి అంశాలు పరిష్కరించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్టు బడ్జెట్‌లో స్పష్టంగా కనిపించింది.
డిజిటలైజేషన్ మంచిదే, కానీ సర్వరోగనివారిణి కాదు. సుస్థిరాభివృద్ధికి కీలకమైన విద్య, ఆరోగ్యం పట్ల బడ్జెట్‌లో కేంద్ర సర్కారు ఆసక్తి కనబరచలేదు. కేవలం పైపై మాటలతోనే సరిపెట్టింది. ఒక్క ఆరోగ్య సేవల రంగంలోనే ఒక కోటి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం చొరవ చూపలేదు. నల్లధనం, దానితో ముడిపడిన అవినీతి అంతానికి పెద్దనోట్లు రద్దు చేశామని పదేపదే చెబుతున్నా, అవినీతి నిర్మూలనకు పక్కా ప్రణాళికేదీ కనిపించడం లేదు. దిగువ స్థాయి అవినీతికి మూలమైన ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు లంచాలు లేకుండా సేవలు అందించేందుకు పౌరహక్కుల చట్టం ఏర్పాటు వంటి ప్రస్తావన లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం ప్రవేశపెట్టిన 2017-18 బడ్జెట్‌లో గొప్పదనం ఏమీలేదు.
ఉన్నత స్థాయి అవినీతికి తల్లి వేరు లాంటి రాజకీయ విరాళాలపై పైపై మార్పులతో సరిపెట్టారు. ఈ వౌలికపరమై వైఫల్యాల వల్ల చరిత్రాత్మకం కావాల్సిన బడ్జెట్ సాదాసీదాగా మారింది. రాజకీయ అవినీతికి ప్రధాన కారణం ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు తప్ప పార్టీల అకౌంట్లు కాదు. పార్టీల జమా,ఖర్చుల వివరాలకే పరిమితం కాకుండా వ్యవస్థీకృత మార్పుల్ని తీసుకువస్తేనే రాజకీయ అవినీతిని, నల్లధనాన్ని కట్టడి చేయగలం.

-జయప్రకాష్ నారాయణ్ లోక్‌సత్తా జాతీయ కన్వీనర్