ఫోకస్

తెలంగాణకు అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించిన బడ్జెట్ రైతులకు వ్యతిరేకంగా, తెలంగాణకు అన్యాయం చేసేలా ఉంది. మన దేశం వ్యవసాయ రంగంపై ప్రధానంగా ఆధారపడి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్ద పీట వేయాలి. కానీ కేంద్రం మాటల బడ్జెట్‌లా చూపించింది. రైతులకు 10 లక్షల కోట్ల రుణాలు ప్రకటించినా, ఇది వాస్తవ రూపం దాల్చడం లేదు. బ్యాంకులు రుణాలు ఇచ్చే సమయంలో అనేక ఆంక్షలు పెడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ రూపకల్పనలో వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయించాలి. ప్రజల ఆకలి తీరుస్తున్న రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. వారికి అవసరమైన రుణాలు అందించాలి. రుణ మాఫీ చేయాలి. యుపిఎ అధికారంలో ఉన్నప్పుడు యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ సూచన మేరకు అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 80 వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేసింది. ఇది ఓట్ల కోసం కాదు, కష్టాల్లో ఉన్న పేద రైతులను ఆదుకోవడానికి అని గమనించాలి. ఎరువులు, ఫర్టిలైజర్లకు ఇంకా సబ్సిడీలు పెంచాలి. అవి రైతులకు అందుబాటు ధరల్లో ఉండాలి. ఇంకా పారిశ్రామిక రంగం కూడా పురోగతి చెందాల్సి ఉంది. అప్పుడే నిరుద్యోగ సమస్య పోతుంది. కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి పెద్ద పీట వేస్తూ, నిరుద్యోగ సమస్య నిర్మూలనకు వీలుగా చర్యలు చేపట్టాలి. అంటే పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అప్పుడే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు. పెట్టుబడులూ వస్తాయి. తద్వారా నిరుద్యోగ సమస్య కొంత వరకైనా తీరుతుంది. యువకులు, మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ఆలోచన చేయాలి. బడ్జెట్ రూపకల్పన చేసేప్పుడు సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు అనుగుణంగా పథకాలు ఉండాలి. ఇక మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడంతో పేదలు, సామాన్య రైతులు దెబ్బ తిన్నారు. చిన్న పరిశ్రమలూ దెబ్బతిన్నాయి. అనేక పరిశ్రమలు మూత పడడంతో దేశ వ్యాప్తంగా 30 శాతం ఉద్యోగాలు పోయి, సుమారు 2 కోట్ల మంది నిరుద్యోగులయ్యారు. పట్టణాల్లో జీవనం సాగిస్తూ చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి ఉద్యోగాలు కోల్పోవడంతో తిరిగి పల్లె బాట పట్టారు. అక్కడ కూడా వారు నిరుద్యోగులుగా బతకాల్సి వస్తుంది. పెద్ద నోట్ల రద్దుతో జిడిపి పడిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నష్టం వాటిల్లింది. ఎన్‌ఆర్‌ఇజి ద్వారా కూలీలకు ఇచ్చే వేతనాన్ని రెట్టింపు చేయాలి. పేదలకు అందుబాటులో ఉండేవి రైళ్ళు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రైల్వే ఛార్జీలు పెంచరాదు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే బడ్జెట్ కేటాయింపులే కాదు అందుకు అనుగుణంగా విడుదల చేయాలి, అవి సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకున్నప్పుడే దేశం పురోగమిస్తుంది.

-డాక్టర్ జె. గీతారెడ్డి, ఎమ్మెల్యే, మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు