ఫోకస్

పాక్ సైన్యానికి స్నేహం ఇష్టం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియాకు పాకిస్తాన్‌కు ఒకే రోజు స్వాతంత్య్రం లభించింది. ఇండియాలో ప్రజాస్వామ్యం బలపడగా, పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం అనేది నామమాత్రమే, ఇంకా మిలట్రీ ఆధిపత్యమే. భారత్, పాక్ మధ్య స్నేహ సంబంధాలు బలపడడం పాకిస్తాన్ సైన్యానికి ఇష్టం లేదు. ఉగ్రవాదులకు ఇష్టం లేదు. దీనిలో భాగంగానే పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదుల దాడులు. ఒకేసారి రెండు దేశాలు స్వాతంత్య్రం పొందినా పాకిస్తాన్‌లో ఇప్పటికీ ప్రజాస్వామ్యం పురుడు పోసుకోలేదు. సైన్యం ఆధిపత్యమే ఎక్కువ. అదే భారత దేశం విషయానికి వస్తే ఇక్కడ ఎన్నో ప్రభుత్వాలు మారాయి. అయితే హింసతో కాకుండా ప్రజాస్వామ్య యుతంగా ప్రజల తీర్పుతోనే ప్రభుత్వాలు మారాయి. పాకిస్తాన్‌లో అలా కాదు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను సైనిక శక్తి కూలదోయడం మామూలే. ఆయూబ్‌ఖాన్ శకం నుంచి ఈ వైఖరి ఉంది. సైన్యం, ఉగ్రవాదుల మధ్య పాకిస్తాన్ నలిగిపోతోంది. బలమైన ప్రజాస్వామ్య దేశం ఏర్పడేంత వరకు పాకిస్తాన్ బాగుపడదు. పొరుగు దేశం ప్రభావం అందరి కన్నా మనపై ఎక్కువ పడుతోంది. భారత ఉపఖండంలోని ఇండియా, పాకిస్తాన్, బాంగ్లాదేశ్ వంటి దేశాల్లోని ప్రభావం ఇండియాపై తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఉగ్రవాద సమస్యను ఎదుర్కోవడానికి కారణం ఇదే. పాకిస్తాన్ ఉగ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదాన్ని అణిచివేస్తేనే ప్రజలకు ఏమైనా చేయగలం అనే విషయం గుర్తించాలి. అదే సమయంలో పొరుగు దేశాల నుంచి ఉగ్రవాదులు విచ్చల విడిగా ఇండియాలోకి ప్రవేశించకుండా ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలి. లోపాలు ఎక్కడున్నాయో పరిశీలించి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. ఇలాంటి వ్యవహారాల్లో రాజకీయాలకు తావులేదు. దేశ భద్రత ముఖ్యం. మన పార్లమెంటుపై దాడి చేశారు. ముంబైలో దాడులు జరిపారు. ఇప్పుడు పంజాబ్‌లో తెగబడ్డారు. ఇబ్బందుల పాలవుతున్నది మనమే. రాజకీయాలను పక్కన పెట్టి దేశ రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి. లోపాలు ఎక్కడున్నాయో దృష్టి పెట్టాలి.

-బి. వినోద్, టిఆర్‌ఎస్ ఎంపి