ఫోకస్

సాహసోపేత బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ నూటికి నూరు శాతం పేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టింది. 70 సంవత్సరాల స్వాతంత్య్ర చరిత్రలో ఇంత విప్లవాత్మకమైన సాహసోపేతమైన బడ్జెట్ ఎవరూ ఇంత వరకూ ప్రవేశపెట్టలేదు. కొన్ని వర్గాలకు పన్నులు వేస్తే కొన్ని వర్గాలకు మినహాయింపు ఇవ్వడం అనేది ఎపుడూ సహజంగా జరుగుతుంది, అయితే దానికి భిన్నంగా ఏ ఒక్క వర్గంపైనా పన్నుల భారం పడకుండా ఈసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నిజాయితీగా పన్ను కట్టేవారందరికీ పన్నులు మినహాయింపు దొరికింది.
ప్రధానంగా ఈ బడ్జెట్‌లో ఏ సంస్కరణలు అయితే తీసుకువచ్చేందుకు గత రెండున్నరేళ్లుగా ప్రయత్నిస్తున్నారో ఆ సంస్కరణలు అన్నీ అమలులోకి తీసుకువచ్చే బడ్జెట్ ఇది. ప్రధాని సంస్కరణలు అన్నీ కార్యదూరంలోకి దాల్చేందుకు సహకరిస్తుంది. ప్రణాళిక- ప్రణాళికేతర ప్రాధాన్యతలు తొలగించి, రంగాల వారీ కేటాయింపులు చేయడం విశేషం,
అన్ని సామాజిక వర్గాలకు, సాధికారత, అభివృద్ధి దృష్టిలో పెట్టుకున్నది. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టడం మరో విశేషం కాగా, రైల్వే బడ్జెట్‌ను కూడా విలీనం చేయడం అనే సంస్కరణలతో ప్రవేశపెట్టింది.
అంతేగాక, ఈ బడ్జెట్‌లో ప్రధానంగా సంక్షేమం, అభివృద్ధి ఉపాధి, మహిళలకు - మైనార్టీల సంక్షేమం, ఎస్సీ- ఎస్టీల అభివృద్ధి, యువత , గ్రామీణ ప్రాంతాల వారికీ పెద్ద పీట వేసే విధంగా దానికి తోడు రైతు ఆత్మవిశ్వాసాన్ని పెంచేదిగా భవిష్యత్‌లో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి 10 లక్షల కోట్ల రూపాయిలు బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు. సంక్షేమం, సంస్కరణలు, అభివృద్ధి అనే మూడు కీలక అంశాల సమ్మిళితంతో రూపొందించిన బడ్జెట్ ఇది. పండిట్ దీన్ దయాల్ సిద్ధాంతాన్ని అమలుచేశారు. పేదరికంలో ఉంటే అతి పేదవాడికి ఫలాలు అందించాలనే సంకల్పంతో వారి ఆశయ సాధనకు ప్రయత్నించే బడ్జెట్ ఇది. వౌళిక సదుపాయాలకు, చేతి వృత్తుల వారికి, కులవృత్తుల వారికి దోహదం చేసేది ఇది. నీటి పారుదల ప్రాజెక్టులకు కూడా పెద్ద పీట వేశారు. అన్ని జిల్లాల్లో దేశవ్యాప్తంగా 4వేల కోట్ల రూపాయిలతో నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఏర్పాటుకు నిర్ణయించడం చూస్తుంటే యువతకు ఇస్తున్న ప్రాధాన్యత అర్ధం అవుతుంది. ఆర్ధిక వ్యవస్థ అసాధారణ రీతిలో మెరుగుపడింది. ద్రవ్యోల్బణం తగ్గింది.
అవినీతి తగ్గింది. అభివృద్ధి అజెండాను ప్రజా ఉద్యమంగా మలుపుతిప్పిన ఆదర్శవాదిగా, సంఘసంస్కర్తగా పూర్తి నాయకుడిగా నరేంద్రమోదీ చరిత్రలో నిలిచిపోనున్నారు. దీనికి ప్రతిబింబించే రీతిలో బడ్జెట్ కనిపిస్తోంది. విప్లవాత్మకంగా రాజకీయాల్లో సంస్కరణలు తీసుకువచ్చి పారదర్శకంగా, నిజాయితీగా విలువలతో కూడుకున్న రాజకీయాలు నడపాలని, డబ్బు పాత్ర ప్రభావితం కారాదని, ఎన్నికలను డబ్బు శాసించే పరిస్థితి ఉండకూడదని, సామాన్యుడు కూడా రాజకీయాల్లోకి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. రాజకీయ పార్టీల ఫండ్ విషయంలోనూ నిబంధనలు తెచ్చారు. నగదు రూపంలో 2వేల రూపాయిలకు మించి జరగకూడదని బడ్జెట్‌లో సూచించారు. కంపెనీలు, వ్యక్తులు ఆదాయంపై నివేదికలు ఇచ్చేలానే పార్టీలు కూడా ఇక మీదట ఇవ్వాల్సి ఉంటుంది.
రియల్ ఎస్టేట్‌కు మళ్లీ జీవాన్ని ఇచ్చారు. రైల్వేలకు సైతం ప్రభుత్వం అనేక నిర్ణయాలను ప్రకటించింది. ప్రధానంగా 2020 నాటికి బ్రాడ్‌గేజ్ మార్గాల్లో గేట్లు ఏర్పాటు చేస్తారు. ఐఆర్‌సిటిసి ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటే సేవా పన్ను రద్దు చేశారు. 25 స్టేషన్ల ఆధునికీకరణ చేపట్టనున్నారు. కొత్త మెట్రో రైలు విధానాన్ని కేంద్రం ప్రకటించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈసారి అనేక కొత్త విషయాలు బడ్జెట్‌లో కనిపిస్తాయి.

-డాక్టర్ కె.లక్ష్మణ్ బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు